Dureddy Raghuvardhan Reddy | కొల్లాపూర్, ఫిబ్రవరి 13 : తెలంగాణ రాష్ట్రానికి దశ నిర్దేశం చేసిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ముందు చూపుతో ఈ రోజు ఎన్నో అవాంతరాలు వచ్చినా తట్టుకొని బలంగా నిలబడే శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోపాటు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి మొదటి తొమ్మిది సంవత్సరాలు బలమైన పునాది పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని గందరగోళపరుస్తుందని.. ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించి కనీస సంక్షేమ పథకాలను కూడా అమలు చేయలేని స్థితిలోకి నెట్టివేసిందన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో మంచి రోజులు రావాలని, కొల్లాపూర్ నియోజకవర్గం పాడిపంటలతో పచ్చగా ఉండాలని కలియుగ దేవుని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి వెంట కోడేరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్, నాయకులు బాలు హుస్సేన్, లాలు తదితరులు ఉన్నారు.
Aadhaar | ఆధార్ కార్డుల కోసం రోడ్డెక్కిన మహిళ.. నలుగురు పిల్లలతో కలిసి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ధర్నా
Langar House | లంగర్ హౌస్లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం