Current Problem | కొల్లాపూర్, ఫిబ్రవరి 08 : కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో ప్రజలు ఆదమరిస్తే అంతే సంగతులు… ఎందుకంటే కర్రలపై వేలాడే విద్యుత్ తీగలు చిన్నపిల్లలు కూడా అందుకోగలిగే ఎత్తులో ఉన్నాయి. సంవత్సరకాలం నుంచి కర్రలపై వేలాడే విద్యుత్ తీగలతో కాలం గడుపుతున్న పేదల నుంచి విద్యుత్తు బిల్లులను వసూలు చేస్తున్నారు కానీ వారి ప్రాణాలకు ముప్పుగా ఉన్న విద్యుత్ లైన్ కు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఆరో వార్డులోని ఒక కాలనీకి చెందిన ప్రజలు దిన దిన గండంగా గడుపుతున్నారు.
పేదల ఓట్ల కోసం పరితపించే ప్రజా ప్రతినిధులు పేదలకు యమపాశాలుగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించడం లేదని కాలనీ వాసులు విమర్శిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే కాలనీకి చెందిన ఒక్కరు తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పొరపాటున తాకడంతో విద్యుత్ ఘాతంకు గురైన సంఘటనలు ఉన్నాయి. సంబంధిత విద్యుత్ అధికారులు వెంటనే తమ కాలనీలో విద్యుత్ మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మునిసిపల్ అధికారులు విద్యుత్ అధికారుల దృష్టికి ఎన్నోసార్లు సమస్యలను తీసుకొని వెళ్ళినా నిర్లక్ష్యంతో పేద ప్రజల ప్రాణాలను పనంగా పెడుతున్నారు తప్ప సమస్యను పరిష్కరించడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. సమస్యను విద్యుత్ అధికారులు దృష్టికి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోతుందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. కొల్లాపూర్‌కు రెగ్యులర్ ఏఈ లేకపోవడం ఇన్చార్జి ఉన్న ఏఈకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైసలిస్తేనే కరెంటు పనులు చేస్తున్నారని పైసలు ఇవ్వలేని మాలాంటి ఇండ్ల వద్ద ఉన్న విద్యుత్ సమస్యను పరిష్కారం చేయడం లేదని కాలనీవాసులు విద్యుత్ అధికారులపై మండిపడుతున్నారు.
సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన తప్పదు : కట్ట శ్రీనివాసులు ఆరో వార్డు బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి
సంవత్సరం నుంచి కర్రలపై వేలాడే విద్యుత్ తీగలతో కాలనీవాసులు ప్రాణ భయంతో గడుపుతున్న ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదు స్తంభాలు ఉన్న కరలపై విద్యుత్ తీగలు ఎందుకు ఉన్నాయో సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలి. సమస్యను పరిష్కారం చేయకుంటే ఆందోళన తప్పదు.
Congress| అధికార పార్టీ నేతల ప్రచార బోర్డులు.. ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
Sabitha Indra Reddy | మహేశ్వరం అభివృద్ధికి పైసా ఇవ్వని సీఎం రేవంత్..: మాజీ మంత్రి సబిత
BJP | ఢిల్లీలో బీజేపీ ఘన విజయం.. 27 ఏళ్ల తర్వాత రాజధానిలో కాషాయ జెండా