Beeram Harsha vardhan reddy | కొల్లాపూర్, ఆగస్టు 24 : కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పల కాపాడుకుంటానని.. కార్యకర్తల ప్రతీ కష్టంలో తాను తోడుగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో ఇటీవల ప్రమాదంలో గాయపడిన బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అండగా నిలిచారు. ఆదివారం స్వయంగా మాజీ ఎమ్మెల్యే రాజాపూర్ గ్రామానికి వెళ్లి బాధితురాలు రాణిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
నిరుపేద కుటుంబానికి చెందిన రాణి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తక్షణ సహాయంగా రూ. 50 వేల రూపాయలను బాధిత కుటుంబానికి అందజేశారు. కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన చిన్నరాముడు అనారోగ్యంతో గత కొద్దిరోజుల క్రితం మృతి చెందాడు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం రాజాపూర్ గ్రామంలో సాయి రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
అదే గ్రామానికి చెందిన గొల్ల గణం మలేష్ అనారోగ్యం కారణంగా మృతి చెందగా..వారి పార్థీవ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మిరపకాయల కురువమ్మ అనారోగ్యంతో మృతి చెందగా.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఆపదలో కష్టం చూడాల్సింది పోయి..
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రాజకీయాలకతీతంగా అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరికి ఎల్ఓసి, సీఎంఆర్ఎఫ్ల ద్వారా కార్పొరేట్ వైద్యం అందించడం జరిగిందని గుర్తు చేశారు. నేడు వర్గంలో ఎల్వోసీ, సీఎంఆర్ఎఫ్ల ఊసే లేదన్నారు. ఆపద సమయంలో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ వైద్య ఖర్చులు భరించలేక ఎవరైనా ఎల్ఓసి, సీఎంఆర్ఎఫ్ కోసం స్థానిక ప్రజా ప్రతినిధి వద్దకు వెళితే ఆపదలో కష్టం చూడాల్సింది పోయి వచ్చిన వారు ఏ పార్టీ వారికి చెందిన వారిని ఆరా తీస్తున్నారని ఆయన విమర్శించారు. ఎవరు అధైర్యపడవద్దని వచ్చేవి మంచి రోజులని ఆశాభావం వ్యక్తం చేశారు. కల్లి బొల్లి మాటలు చెప్పి గాలివాటానా గెలిచిన వారికి ప్రజల కష్టాలు తెలియవు అన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ ప్రభుత్వానికి, ప్రజలను వేధిస్తున్న నాయకులకు గుణపాఠం చెప్పేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అధికారం ఉన్నా లేకున్నా తను నియోజవర్గంలోని ప్రతి కార్యకర్తకు కష్టాలలో ఉండే ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటానని వెల్లడించారు. సహాయం చేయకున్నా పర్వాలేదు కానీ కీడు చేసేందుకు అనవసరంగా బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల యోగక్షేమాలను తెలుసుకున్నారు.
మానవతా దృక్పథంతో ప్రజల కష్టాలను తెలుసుకొని స్పందించిన మాజీ ఎమ్మెల్యేకు బాధిత కుటుంబంతోపాటు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరూ ఏ కష్టంలో ఉన్న రాజకీయాలకతీతంగా స్పందించే మనసత్వం కలిగిన గొప్ప నాయకుడు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అని వారు కొనియాడారు. ఈ సందర్భంగా వారితోపాటు మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Rat | నీళ్ల బిందెలో ఎలుక.. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అస్వస్థత
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు
IADWS | ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
Finger Millet | రాగులను అసలు రోజుకు ఎంత మోతాదులో తినాలి..? వీటితో కలిగే లాభాలు ఏమిటి..?