CITU | అచ్చంపేట రూరల్, జులై 9 : కార్మికులు దశాబ్ద కాలం పాటు పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాయడం దుర్మార్గమని.. వాటికి వ్యతిరేకంగా జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జులై 9న కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అచ్చంపేట సివిల్ సప్లై గోదాం డీటీ మోతిలాల్‌కు సమ్మె నోటీసులు అందజేశారు. గింజలు కొనుగోలు చేసే మార్కెట్ సెక్రటరీ నరసింహకు హమాలీల ఆధ్వర్యంలో కార్మిక సంఘం నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు. హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్మికులకు వారి అభివృద్ధికి తోడ్పాటు అయ్యే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి బి రాములు, నాయకులు శివకుమార్, సైదులు, చంద్రయ్య, రేనయ్య, లక్ష్మయ్య, జంగయ్య, దాసియ, వేనయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
SIGACHI | మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. సిగాచీ పరిశ్రమ ప్రకటన
Phoenix Movie | ఈ సినిమాకు ముందు 120 కిలోలున్నా : విజయ్ సేతుపతి కుమారుడు సూర్య