కాలువ పూర్తి చేస్తారా.. రాజీనామా చేస్తారా?
ఎల్ఎం6 కెనాల్ పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీఇచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయించలేదని పెద్దలింగాపూర్ రైతులు మండిపడ్డారు.
- ఎమ్మెల్యే కవ్వంపల్లి ఏం చేస్తారో తేల్చుకోవాలి
- హామీఇచ్చి ఏడాదైనా తట్టెడు మట్టి తీయలే..
- మండిపడ్డ పెద్దలింగాపూర్ రైతులు
ఇల్లంతకుంట రూరల్, ఫిబ్రవరి14: ఎల్ఎం6 కెనాల్ పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీఇచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయించలేదని పెద్దలింగాపూర్ రైతులు మండిపడ్డారు. రైతులకు రూ.3.20కోట్ల పరిహారం ఇప్పించి కాలువ నిర్మాణం చేయిస్తారో.. లేదంటే పదవికి రాజీనామా చేస్తారో.. తేల్చుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
పది రోజుల్లో పనులు మొదలుకాకుంటే ఆమరణ నిరాహారదీక్ష చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ క్రమంలో రంగనాయకసాగర్ ఆర్డీ3 ఎల్ఎం6 కెనాల్ నిర్మాణ పనులను చేపట్టాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ సబ్స్టేషన్ సమీపంలో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకున్నది.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, కిలోమీటర్నర ఉన్న కాలువను కూడా తవ్వించని ఎమ్మెల్యే ఐదేళ్లు పదవిలో ఉండి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సాగునీళ్లు లేక యాసంగిలో పంటలు ప్రతి ఏడాది ఎండిపోతున్నాయని వాపోయారు. కాలువ నిర్మాణం చేపట్టే వరకు రిలేదీక్ష విరమించేది లేదన్నారు. 20గ్రామాల రైతులు ఏడాది కాలంగా కాలువ కోసం దీక్ష చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

