Harish Rao | రేవంత్ రెడ్డి మొనగాడు కాదు, మోసగాడు. నల్లమల పేరు చెప్పి నల్లమల గౌరవం రేవంత్ రెడ్డి తగ్గిస్తున్నాడు. ఇప్పటి వరకు 29 వేల 350 కోట్ల రైతు భరోసా డబ్బులు బాకీ పడ్డాడు. ఈ ప్రభుత్వంలో బోనస్ కాస్తా బోగస్ అయిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొలకెత్తిన గింజలు కొనలేని రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ను మొలకెత్తనియ్య అని అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం జొన్నలు, మక్కలు, సోయాబీన్, పల్లి , సన్ ప్లవర్ కొంతమేరే కొంటుంది. కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటుంది. ఖరీఫ్ సీజన్ లో వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. ఉమ్మడి పాలమూరులో 14 సీట్లకు 14 సీట్లు గెలిచి కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడిస్తాం. దళారుల, మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి తోలు బొమ్మ, ఆయన ఎవరి తోలు తియ్యలే. రాష్ట్రం సాధించిన పార్టీగా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు.
తెలంగాణ కోసం రాజీనామాలతో చరిత్ర సృష్టించిన నాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా రాదంటున్న రేవంత్ రెడ్డి, పాలక పక్షం అవుతుందని ఒప్పుకున్నాడు. 100 స్థానాల్లో ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డిని, అయన మోసాలను ఎండగడుతూనే ఉండాలి. పేరుకే BC,SC,ST కార్పొరేషన్లు, ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదు. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల వారికి కేసీఆర్ న్యాయం చేశారు. లంకె బిందెలు ఉన్నాయి అనుకుంటే పైసలు లేవని రేవంత్ రెడ్డి అంటున్నాడు.
స్కాంల ప్రభుత్వం వద్దు..
రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు కూతవేటు దూరంలో 100 కోట్ల రూపాయలతో గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. గెస్ట్ హౌస్ చుట్టూ 17 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలు వేసుకున్నాడు. రేవంత్ రెడ్డి మనవడితో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడేందుకు పైసలు ఉంటాయి. కేరళ, బీహార్, మహారాష్ట్ర , ఢిల్లీలో వందల కోట్లు ఖర్చు పెట్టీ యాడ్స్ ఇచ్చేందుకు డబ్బులు ఉంటాయి. పేద వర్గాల వారికి పైసలు ఇచ్చేందుకు డబ్బులు లేవని అంటున్నాడు.
కేసీఆర్ హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం. ఫీజు రీయింబర్స్ మెంట్ కు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడంతో ఒక తరమే దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఎత్తు పొడవులతో ప్రజలకు ఉపయోగం ఉండదు. భూమి బద్దలైనా మల్లొచ్చేది మాత్రం కేసీఆర్ ప్రభుత్వమే. స్కాంల ప్రభుత్వం వద్దు.. స్కీమ్ ల ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తుంది.ఎవడు అయితే కేసులు పెట్టిండో, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరినీ వదిలిపెట్టం.రిటైర్డ్ అయినా, ఎక్కడున్నా పట్టుకొని వచ్చి బొక్కలో వేస్తాం.పెట్రోల్, డీజిల్, ఎరువులు, RTA ఛార్జీలు, మధ్యం ధరలు పెరిగాయి.ఔరంగజేబు జుట్టుపై పన్ను వేసినట్లు రేవంత్ రెడ్డి ప్రజల పై పన్నులు వేస్తున్నాడు.రేవంత్ రెడ్డి 5 యేండ్ల పాలన 50 ఏండ్ల వరకు ప్రజలు తిట్టుకునే పరిస్థితి.రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర యేండ్లు అవుతుంది, ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు.పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజక్ట్ లగా కేసీఆర్ మార్చారు.
ఒక్క రూపాయి ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదు..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను 75 శాతం పూర్తి చేశాము. మిగిలిన పనులు పూర్తి చెయ్యకుండా రెండున్నర యేండ్లుగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేసి 3 లక్షల 30 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాము. ఈ ప్రభుత్వంలో ప్రాజెక్ట్ లు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.ఈ ప్రభుత్వంలో కృష్ణా నీళ్లు ఆంధ్రాకు పోతున్నాయి
ఈ ప్రభుత్వంలో SLBC టన్నెల్ ను మూరెడు తొవ్వలేదు.సిగాచి ఫ్యాక్టరీలో 54 మంది చనిపోతే ఒక్క రూపాయి ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదు.కార్యకర్తలు గట్టిగా పనిచేసి అచ్చంపేట గడ్డపై గులాబీ జెండా ఎగరెయ్యాలి.అప్పుడు కొడంగల్ కు ఇంచార్జ్ గా ఉండి రేవంత్ రెడ్డిని ఓడించాము.ఈసారి ఉమ్మడి పాలమూరులో 14 స్థానాలకు 14 బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డిలతో పాటు తదితర స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.