Singireddy Niranjan reddy | గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ లో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆ తర్వాత కేసిఆర్ సారథ్యంలో అభివృద్ధి చేసుకున్న తెలంగాణ రాష్ట్రం చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రమాదంలో పడిందని విమర్శించారు. కర్ణాటకలో తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాలే అయినా కృష్ణా నదిలో తెలంగాణ వాటాను సాధించలేకపోతున్నారని విమర్శించారు. కర్ణాటక రాష్ట్రం కృష్ణా నదిపై మూడు కొత్త ప్రాజెక్టులను తాగునీటి ప్రాజెక్టుల పేరా నిర్మిస్తున్న ఎందుకు ప్రశ్నించడం లేదని..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
ఆంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయోజనాలకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారు సహకరిస్తుందని విమర్శించారు. నీటి వివాదాలు ఇతర అంశాలను నిర్లక్ష్యం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కేసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తే పాలకులకు వాటిని నడిపే చేతకాక వెనక్కి నెట్టుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం..
రేపు రాబోయేది కేసీఆర్, కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ సర్కారే అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు మరింత పురోభివృద్ధి సాధించడమే కాకుండా కృత్రిమ మేధస్సు ఉద్యోగాలు రాబోతున్నాయని కార్యకర్తల హర్షద్వానాల మధ్య ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో దళిత బిడ్డలు గురుకులాల్లో విద్యను అభ్యసించి యుద్ధ విమానాలకు పైలట్‌గా కావ్య అనే విద్యార్థిని ఎంపిక కావడం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేద బిడ్డలకు ఉన్నత విద్యను అందించడమే కారణంగా అభివర్ణించారు. ఎస్ఐఆర్ పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటును నమోదు చేసే విధంగా నెల రోజులపాటు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. బీహార్ బెంగాల్ వంటి రాష్ట్రాలలోబూతుకు 40, 50 ఓట్ల చొప్పున తొలగించి పెద్ద ఎత్తున కుట్రకు పాల్పడ్డారని విమర్శించారు.
తమిళనాడులో స్టాలిన్ నియోజకవర్గంలో 41వేల ఓట్లను ఎస్ఐఆర్ పేరుతో తొలగించడం జరిగిందన్నారు. స్టాలిన్ కేవలం 8000 ఓట్లతో ఓడిపోయారు అంటే ఎంత కుట్ర జరిగిందో స్పష్టమవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆంధ్రాలో కుట్రకు పాల్పడ్డారు అన్నారు. చంద్రబాబు నాయుడు సేవా మిత్రా అనే ఒక వెబ్ సైట్‌ను సృష్టించి గడపగడపకు వెళ్లి ప్రజలను కలిసి ఆ సైట్లో పొందుపరచడం జరిగిందన్నారు.
ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకునే క్రమంలో టీడీపీ ఇతర పార్టీల పట్ల సుముఖంగా ఉన్న వారిని గుర్తించి 30 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. తెలంగాణలో ఆయన శిష్యుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడని ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి బీఎల్ఓ లే బీఎల్ఏ లుగా అవతారం ఎత్తే అవకాశాలు ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని..
భువనగిరి బీజేపీ నాయకుడు ఒకరు ఒక సందర్భంలో మాట్లాడుతూ.. తెలంగాణలో తాము తొండి చేసి మొండి చేసి పోర్లి… దొర్లి అయినా సరే అధికారంలోకి వస్తామని చెప్పాడు అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి ముంచుకొచ్చే ప్రమాదాలను ముందుగానే పసిగట్టితే మను కూడా సాధించడం సాధ్యమవుతుందన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వాలను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. అజాగ్రత్తగా ఉంటే ఓట్ల గల్లంతు ఖాయం అన్నారు. బీఆర్ఎస్ సానుభూతిపరులుగా వారి దృష్టికి వస్తే వారి ఓట్లను తొలగించే కుట్ర జరగవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృష్ణా నదిలో నీటి దోపిడీ కి పాల్పడుతున్న అంశాలను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పాలకుల తీరును తీవ్రస్థాయిలో ఎండగడుతూ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు ఇన్చార్జీలు మహ్మద్ జహంగీర్, మెట్టు శ్రీనివాసులు కార్యకర్తలకు ఆయా అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఎస్ ఐ ఆర్ లో బిఎల్ఎ ల పాత్ర గురించి వివరించారు. అదేవిధంగా బీ ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో క్రియాశీలక సభ్యత్వాలు సాధారణ సభ్యత్వాలు తదితర అంశాలపై కార్యకర్తలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.
ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటా..
నాగర్ కర్నూల్ నియోజకవర్గం లోని ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుంటానని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. 20 రోజుల తర్వాత ప్రతి గ్రామానికి ఒక రోజు కేటాయించి ప్రతి కార్యకర్త ఇంటికి పోయి వారి యోగక్షేమాలు వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకుంటా అన్నారు. తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని రాబోయే రోజుల్లో వారికి న్యాయం చేసే విధంగా తన కార్యాచరణ ఉండబోతుందన్నారు.
సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదులో పార్టీ కోసం పనిచేసే క్రియాశీల కార్యకర్తలను సభ్యులుగా చేర్పించాలని ఆయన సూచించారు. ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తు అంతా మనదే అని మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీమాజీ ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళ నాయకులు వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Uttar Pradesh | బ్యాంక్ లాకర్లో పెట్టిన 96 గోల్డ్ ప్యాకెట్లు మాయం.. యూపీలో ఘటన
Batwara 1947 | దేశ విభజన నేపథ్యంలో సన్నీ డియోల్ ‘బట్వారా 1947’.. ఆసక్తికరంగా టీజర్!