Peddamma Temple | ఆత్మకూరు పట్టణ ప్రజల ఇలవేల్పు అయిన పెద్దమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణం కోసం పట్టణ ప్రజలు విరివిగా విరాళాలు ఇచ్చి గుడి నిర్మాణానికి సహకారం అందించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నల్లగొండ శ్రీనివాసులు, వాల్మీకి సంక్షేమ సంఘం నాయకులు బాలు కోరారు. ఇవాళ ఆత్మకూరు పట్టణంలోని ఐదో వార్డులో ఇంటింటికి తిరుగుతూ కొత్తగా నిర్మాణం చేపడుతున్న పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణం కోసం ప్రజల నుంచి విరాళాలను సేకరించారు.
ఈ సందర్భంగా నల్లగొండ శ్రీనివాసులు, బాలు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు కోరిన కోరికలు తీర్చే పట్టణ ఇలవేల్పు పెద్దమ్మతల్లిని తమ ఆరోగ్య దైవంగా కొలుచుకుంటారని పట్టణ ప్రజల కోరిక మేరకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, కుల సంఘాల నాయకులు నూతనంగా ఆలయం నిర్మించేందుకు కంకణం కట్టుకున్నారన్నారు.
అందులో భాగంగానే వార్డుల వారీగా అన్ని పార్టీల నాయకులు ప్రజలతో కలిసి విరాళాలను సేకరిస్తున్నారని.. ప్రజలంతా విరివిగా విరాళాలు ఇచ్చి ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాలనీ ప్రజలతోపాటు మహిళలు, యువకులు పాల్గొన్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు