Rajiv Yuva Vikasam Scheme | అమరచింత, మార్చి 26 : కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల హామీలతో ప్రజలను నిలువునా ముంచి అధికారంలోకి వచ్చి.. తీరా హామీలను నెరవేర్చాలని నిలదీసిన వారినంతా కేసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేసి కాలయాపన కొనసాగిస్తుందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతుబ్ ఆరోపించారు.
ఇప్పుడు నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చేందుకు అంటూ రాజీవ్ యువ వికాస పథకం పేరుతో వడ్డీ లేని రుణాలను ఇస్తామంటూ అందుకు రేషన్ కార్డు జతపరచాలని నిబంధన పెట్టడం స్థానిక ఎన్నికల ముందు యువతరాన్ని మరోసారి మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేషన్ కార్డు నిబంధన తక్షణమే తొలగించాలి..
రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం పెట్టిన రేషన్ కార్డు నిబంధనను తక్షణమే తొలగించాలని ఇవాళ అమరచింత తహసీల్దార్ రవికుమార్‌కు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేశామని పదేపదే వేదికలపై ప్రకటనలు చేస్తున్నా.. ఏ ఒక్కచోట ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కావడంలేదని అడిగిన వారిని భయభ్రంతులకు గురిచేస్తూ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని కుతుబ్ ఆరోపించారు.
రాజీవ్ యువ వికాస పథకానికి రేషన్ కార్డు నిబంధన ఎత్తివేయకపోతే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని కుతుబ్ వెల్లడించారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఏఐవైఎఫ్ నాయకులు ఎర్రన్న, నిస్సార్, వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.
BRS : కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ : రావులపల్లి రాంప్రసాద్
TTD | టీటీడీకి తిరుమల విద్యా సంస్థల చైర్మన్ భారీ విరాళం
Road Accident | సికింద్రాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి