Ajit Pawar | అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కుట్ర..డీజీసీఏ విచారణ బూటకం.. ప్రధానికి రోహిత్ లేఖ
తన చిన్నాన్న, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, తెలుగుదేశం నేత రామ్మోహన్ నాయుడుతో వెంటనే రాజీనామా చేయించాలని ఎన్సీపీ (శరద్ పవార్) నేత, ఎమ్మెల్యే రోహిత్ పవార్ డిమాండ్ చేశారు.
- మంత్రి రామ్మోహన్‌తో రాజీనామా చేయించాలి
- డీజీసీఏ విచారణ బూటకం.. ప్రధానికి రోహిత్ లేఖ
ముంబై, ఫిబ్రవరి 21: తన చిన్నాన్న, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, తెలుగుదేశం నేత రామ్మోహన్ నాయుడుతో వెంటనే రాజీనామా చేయించాలని ఎన్సీపీ (శరద్ పవార్) నేత, ఎమ్మెల్యే రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాద ఘటనలో విమానయాన సంస్థను కాపాడేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారని, ఆ సంస్థ యజమానికి, మంత్రికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధమే దీనికి కారణమని అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
విమానయాన సంస్థ వీఎస్ఆర్ వెంచర్స్ యాజమాన్యంతో మంత్రికి సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించిన ఆయన రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉండగా, ఆ ప్రమాదంపై నిష్పాక్షిక విచారణ అసాధ్యమని అన్నారు. డీజీసీఏ విచారణను ఒక బూటకంగా ఆయన పేర్కొన్నారు. విమానంలో ఉద్దేశపూర్వకంగానే అత్యధికంగా ఇంధనాన్ని నింపారని, అలా చేస్తే అది ఒక ఎగిరే బాంబులా మారుతుందని చెప్పారు. ఈ ప్రమాదం వెనుక రాజకీయ కుట్ర కోణం కూడా ఉందని తెలిపారు. ఉన్నత స్థాయి నియంత్రణ కమిటీతో దర్యాప్తు చేయించాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

