Ala Venkateshwar Reddy | మూసాపేట, మార్చి 26 : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే యాసంగిలో పంటలు నష్టం జరిగిందని ఆరోపిస్తూ నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ భూత్పూర్ లో ఆయన స్థానిక నాయకులతో పాటు కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ యాసంగి సీజన్లో రైతులు అతి కష్టం మీద పంటలు సాగుచేశారని చెప్పారు. గతంలో మాదిరిగా ఎత్తిపోతల ద్వారా సాగునీరు వాగులు చెరువులు నింపుతారని ఆశించి రైతులు పంటలు సాగు చేశారని చెప్పారు. కానీ ప్రభుత్వం సకాలంలో స్పందించి ఎత్తిపోతల ద్వారా వరద నీటిని వాగులకు చెరువులు కుంటలకు తరలించకపోవడంతో భూగర్భ జలాలు ఒక్కసారిగా పడిపోయాయి అన్నారు.
గతంలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ వరద వస్తుందంటేనే ముందస్తుగా సంబంధిత ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఉన్న నీటిని ఎత్తిపోయాలని సూచించే వారని చెప్పారు. మరోవైపు సంబంధిత అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశిస్తూ వీలైనంత మేరకు సాగునీటిని ఎత్తిపోయాలని సూచించే వారిని చెప్పారు. కేసీఆర్ ముందుచూపుతోనే గత దశాబ్ద కాలంగా రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కలంగా పంటలు పండించుకున్నారని ఆల వెంకటేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
భూగర్భ జలాల పెంపుకు పెద్దపీట వేస్తూ..
మరోవైపు భూగర్భ జలాల పెంపుకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించే వారిని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని రైతులను పట్టించుకునే నాయకులెవరు లేరని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే రైతులు పంటలు పండుతాయని ఆశించి రైతులు లక్షలకు లక్షలు పెట్టి పెట్టుబడులు ఖర్చు చేస్తూ పంటలు సాగు సాగు చేశారని చెప్పారు. కానీ సోయిలేని ప్రభుత్వంతో సాగునీరు అందక ఎండి పోతున్నాయని అన్నారు.
సాగు చేసిన పంటలు ఎండిపోవడంతో పశువులను మేతకు వదులుతున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు నానా ఇబ్బందులు పడుతూ పంటను కాపాడుకున్న రైతులపై కూడా ప్రకృతి పగబట్టిందన్నారు. ఇటీవలే కురిసిన వడగండ్ల వానకు రైతులు తీవ్రంగా నష్టపోయారని.. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తి అయ్యిందని చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు.
రైతు బంధు రాక రుణమాఫీ కాక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. దేవరకద్ర నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వెంటనే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించాలని చెప్పారు. ఈ సీజన్లో పంట సాగుచేసి నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించాలని సూచించారు. ప్రభుత్వం పక్షపాతం ధోరణి వదిలి పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
BRS : కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ : రావులపల్లి రాంప్రసాద్
TTD | టీటీడీకి తిరుమల విద్యా సంస్థల చైర్మన్ భారీ విరాళం
Road Accident | సికింద్రాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి