Indiramma Houses | హన్వాడ, జూన్ 27 : ఇందిరమ్మ ఇండ్ల పేరిట రాత్రి పగలు తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని శుక్రవారం మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తాండూరు మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుమతి పేరిట విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలతో ఇసుకను తరలిస్తున్నారని బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కొండ శివలింగం ఆరోపించారు. ఇసుకను నియంత్రించాల్సిన తహసిల్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇండ్లు నిర్మించుకోకుండా కూడా ఇండ్ల మధ్యల ఇసుకను విపరీతంగా డంపింగ్ చేసుకుంటున్నారు. వెంటనే అధికారులు అనుమతి లేకుండా తరలిస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని లేకుంటే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.