కేసముద్రం, సెప్టెంబర్ 28 : అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో అక్టోబర్ 6 నుంచి 19 వరకు జరగనున్న ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలకు అంపైర్‌గా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు కొమ్ము రాజేందర్ ఎంపికయ్యారు.
ఈ మేరకు వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శిలు రమేశ్‌కుమార్, రమేశ్‌రెడ్డి ఆదివారం ఒక్క ప్రకటనలో తెలిపారు. గౌహతిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీలకు అంపైర్‌గా వ్యవహరించనున్న రాజేందర్‌ను పలువురు అభినందించారు.