వీపనగండ్ల, సెప్టెంబర్ 28 : కడుపు నొప్పి బాధతో చికిత్స కోసం దవాఖానకు వస్తే వైద్యం వికటించి బాలిక మృతి చెందిన ఘటన ఆదివారం పెబ్బేరులో చోటు చేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన బొ రెల్లి రాముడు, శిరీష దంపతుల కుమార్తె రమ్య(6)కి ఆదివారం తెల్లవారు జామున కడుపు కొప్పి రావడంతో తల్లిదండ్రులు పెబ్బేరులోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకొచ్చారు.
దవాఖాన చికిత్స చేస్తున్న సందర్భంలో బాలిక అపప్మారక స్థితిలోకి వెళ్లడంతో తక్షణమే మరో దవాఖానకు తీసుకెళ్లాలని వారు సూచించారు. అంబులెన్స్‌లో మహబుబ్‌నగర్ జిల్లా దవాఖానకు తరలించగా వైద్యులు పరిక్షించి బాలిక అప్పటికే మృతి చెం దినట్లు తెలిపారు. పెబ్బేరు దవాఖానలో సరైన చికిత్స అందించలేదని బాలిక మృతదేహంతో దవాఖాన ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. తమ తప్పులేదని దవాఖాన వర్గాలు చేతులు దులుపుకోవడంతో ఆగ్రహించి న్యాయం జరిగే వరకు ఆదోళన చేపడుతామని హెచ్చరించారు.