MLA Madhusudan Reddy | భూత్పూర్, జులై 02 : రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి ప్రజా అవసరాలను తీరుస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించిందని ఆయన అన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో కొన్ని లోపాలు ఉన్నందువల్ల సబ్సిడీ డబ్బులు లబ్ధిదారులకు రావడంలేదని ఆయన తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.
అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో అన్ని పథకాలను మహిళా సంఘాల ద్వారానే అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ పథకం ద్వారా ఏడాదికి 5500 కోట్ల రూపాయలను ఆర్టీసీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని.. దీంతో రాష్ట్రంలో ఆర్టీసీ లాభాల బాట పట్టిందని తెలిపారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలు సన్నబియ్యం తినాలని ఆలోచనతో రేవంత్ రెడ్డి దేశంలోనే ఎక్కడా లేనంతగా మన రాష్ట్రంలో సన్నబియాన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పట్టణ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామంలో మహిళా సంఘం సభ్యురాలు అయిన చెన్నమ్మ విద్యుత్ షాక్తో మృతి చెందడంతో కుటుంబానికి 10 లక్షల రూపాయలను అందజేశారు.
మృతురాలు సంఘంలో 84 వేల రూపాయలు అప్పు ఉండగా ఆ అప్పును ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. అనంతరం మండలంలోని మద్దిగట్ల గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో తయారుచేసిన వంటకాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ నూరు నజీబ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, మండల అధ్యక్షుడు కేశిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సతీమణి కవిత, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మ, నాయకులు నరసింహారెడ్డి, బోరింగ్ నర్సింలు, ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
SIGACHI | మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. సిగాచీ పరిశ్రమ ప్రకటన
Phoenix Movie | ఈ సినిమాకు ముందు 120 కిలోలున్నా : విజయ్ సేతుపతి కుమారుడు సూర్య