Swami bodhamayananda | అయిజ రూరల్ : మండల పరిధిలోని సంకాపురం గ్రామంలో శ్రీశ్రీరామకృష్ణ ధ్యాన మందిరాన్ని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉండాలని సూచించారు .
చిన్ననాటి నుండే భక్తి భావాలను కలిగి సేవా భావాలను అలవర్చుకోవాలని చెప్పారు. ఎదుటివారి పట్ల ప్రేమ, దయ, ఆప్యాయత కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం గ్రామ పురవీధుల కుండా శోభాయాత్ర నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ భవ ప్రచార పరిషత్ కన్వీనర్ సుబ్రమణ్యం శర్మ, మాజీ కన్వీనర్ సూర్య ప్రకాష్, జాయింట్ కన్వీనర్ ఉమాదేవి, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు వెంకట్రాములు, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు రాముడు, గ్రామస్తులు రాజీవ్ జాగిర్దార్, సూర్యనారాయణ, దేవరగోపాల్, చైర్మన్ రాముడు, తిమ్మప్ప, బజారి, ఉరుకుందు, రామకృష్ణ సేవాసమితి సభ్యులు సత్యనారాయణ, కృష్ణ, గోపాల్, ఈశ్వరన్న ,ఈశ్వర్, దామోదర్ ,బ్రహ్మయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Warangal | కేంద్రం బడ్జెట్ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా
Swami bodhamayananda | ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత : స్వామి బోధమయానంద
Robbery | బైనపల్లి ఆలయంలో చోరీ.. హుండీ ధ్వంసం చేసి నగదు, ఆభరణాలు అపహరణ