వరంగల్ చౌరస్తా: పెట్టుబడిదారీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తయారు చేసిన బడ్జెట్ను(Central budget) వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేయాలని కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో వివిధ వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా అనంతరం జరిగిన కార్యక్రమానికి న్యూ డెమోక్రసీ నాయకులు రాచర్ల బాలరాజు అధ్యక్షత వహించగా ఐక్య కమ్యూనిస్టు నాయకులు మాట్లాడారు. ఎల్ఐసి 100% ప్రైవేట్ పరం చేయడాన్ని తక్షణమే విరమించుకోవాలన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం ఆపివేయాలని డిమాండ్ చేశౠరు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కు 50 శాతం నిధులు పెంచాలని, జిడిపిలో విద్య వైద్య రంగాలకు మూడు శాతం నిధులు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సిపిఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, సిపిఐ ఎంఎల్ నీ డెమోక్రసీ జిల్లా నాయకులు గంగుల దయాకర్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి యాదగిరి, ఎంసిపిఐయు నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, ఎస్ యుసిఐ నాయకులు, సత్యనారాయణ పాల్గొన్నారు.