అలంపూర్ : ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయుడు హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులు సకాలంలో బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలన్నారు. ఐజ, ఉమ్మడి ఇటిక్యాల మండలాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ 88 మంది లబ్ధిదారులకు 20 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
AA22 x A6 | అవతార్‌ని మించి అట్లీ- బన్నీ మూవీ.. రోబోలు, జంతువులతో…
Will Pucovski: కంకషన్ తట్టుకోలేక రిటైర్మెంట్ ప్రకటించిన 27 ఏళ్ల ఆసీస్ బ్యాటర్