Vaishnavi Chaitanya | మనం పబ్లిక్‌లో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే లేని పోని చిక్కులో పడడం ఖాయం. రీసెంట్గా బేబి హీరోయిన్ స్టేజ్ మీద అందరి ముందు ఓ మాట మాట్లాడడంతో అందరు అవాక్కయ్యారు. బేబి చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య.. మొదట్లో ‘సాఫ్ట్వేర్ డెవలపర్’ షార్ట్ ఫిలింతో పాపులారిటీ దక్కించుకుంది. యూట్యూబ్‌లో ఇది సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు వచ్చాయి. తొలుత సైడ్ క్యారెక్టర్లలో నటించిన వైష్ణవి చైతన్య, ఆ తర్వాత 2018లో ‘టచ్ చేసి చూడు’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అలా వైకుంఠపురములో, వరుడు కావలెను , టక్ జగదీష్ , ‘వలిమై , ‘ప్రేమదేశం వంటి చిత్రాల్లో నటించింది .
బేబీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంది హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఈ సినిమా తర్వాత వైష్ణవి చైతన్యకి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సిద్ధు జొన్నలగడ్డ సరసన జాక్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది ఈ వయ్యారి. ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలకానుంది.గత కొద్ది రోజులుగా మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలలో చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సిద్దు జొన్నలగడ్డ ,హీరోయిన్ వైష్ణవి చైతన్య పలు ప్రాంతాల్లో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల భీమవరంలోని విష్ణు కాలేజీలో నిర్వహించిన ఈవెంట్లో జాక్ చిత్రయూనిట్ సందడి చేసింది. ఈ కార్యక్రమంలో అక్కడి విద్యార్థులతో సిద్దు, వైష్ణవి ఇంట్రాక్ట్ అవుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
స్టేజ్ మీద వైష్ణవి మాట్లాడుతూ స్టూడెంట్ లైఫ్, కాలేజీ జీవితం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అదే సమయంలో భీమవరంలో అని మర్చిపోయి రాజమండ్రి అనేసింది.అప్పుడు సిద్ధు వచ్చేసి చెవిలో భీమవరం అని చెప్పడంతో వెంటనే మైక్ లో ఎఫ్ అనే పదం అనేసింది. ఇంతకు ముందు రాజమండ్రి వెళ్లి ఇక్కడకు వచ్చాం కాబట్టి కన్ఫ్యూజన్ అయ్యాను అంటూ కవర్ చేసుకుంది. అంత వరకు పర్లేదు కాని తెలుగు అమ్మాయి అయి ఉండి అంత మంది ముందు ఎఫ్ అనే పదం వాడడంపై ఇప్పుడు వైష్ణవి చైతన్యని బాగా ట్రోల్ చేస్తున్నారు. స్టేజ్ మీద అంతమంది ముందు ఇలా బూతులు మాట్లాడం ఏంటని నెటిజన్లు ఆమెని ఏకి పారేస్తున్నారు. ప్రస్తుతం వైష్ణవి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.