Sand Mafia | జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలో టిప్పర్ యజమానులు అక్రమ ఇసుక వ్యాపారం (Sand Mafia) తోపాటు మట్టి వ్యాపారం చేస్తూ డబ్బులు గడిస్తున్నారు. ఇసుక ఒక వైపు పేదవాడికి అందని ద్రాక్షగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదని చెపొచ్చు. ఎర్రవల్లి వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు గృహ నిర్మాణ సంస్థ విస్తరించడం దానికి తోడు బిల్డర్స్ అధిక డబ్బులు వెచ్చించి టిప్పర్ ఇసుక కొనుగోలు చేయడం ఇదే అదునుగా భావించిన టిప్పర్ యజమానులు భారీ మొత్తంలో సొమ్ము చేసుకొంటున్నారు.
కొండపేటకు చెందిన వ్యక్తులు, తిమ్మాపురానికి చెందిన ముగ్గురు వ్యక్తుల కనుసన్నల్లో రియల్ ఎస్టేట్ వెంచర్‌కి, ప్రైవేటు స్థలాలకు మట్టి కొడుతూ మైనింగ్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు. గుట్టలను తవ్వి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మట్టిని అమ్మి సొమ్ము చేసుకోవడం టిప్పర్ యజమానులకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది.
ఇప్పడు తిమ్మాపురం పరిధిలోని ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ 549లో టెన్త్ బెటాలియన్ వెనక నుంచి టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు తెలియజేశారు. మైనింగ్ అనుమతులు ఉంటే పట్టపగలు మట్టిని తరలించే వారని రాత్రి వేళలో ఈ పని ఏంటని చౌరస్తా వాసుల నోటా గుసగుసలు వినిపిస్తున్నాయి.
Government Hospital | రికార్డ్ బ్రేక్.. 5 రోజుల్లో 200 సర్జరీలు