CEC : కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఇవాళ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి ఏప్రిల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మే 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేస్తున్న సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ను మీడియా ప్రతినిధులు అస్సాం సీఎం హిమాంత బిశ్వశర్మ ఇటీవల చేసిన మతపరమైన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు. దానిపై సీఈసీ ‘నో కామెంట్’ అని స్పందించారు. ఈ సమయంలో ఎన్నికలకు ముందు చేసిన ప్రకటనలు, నిర్ణయాలపై మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు.