Gurukul Students | పుస్తకాలు తీసుకున్నారని విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపాల్.. వీడియో
Gurukul Students | ప్రిన్సిపాల్ విద్యార్థులను వాతలు వచ్చేలాగా చితకబాదిన ఘటన అలంపూర్ చౌరస్తాలోని మహాత్మ జ్యోతిరావు బాపూలే గురుకుల పాఠశాలలో వెలుగుచూసింది.
Gurukula Students | విద్యార్థులకు మంచిచెడులు చెప్పాల్సిన ప్రధానోపాధ్యాయుడే వారి పట్ల పైశాచికంగా వ్యవహరించాడు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను వాతలు వచ్చేలాగా చితకబాదిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ – ఉండవెల్లి మండలంలో అలంపూర్ చౌరస్తాలోని మహాత్మ జ్యోతిరావు బాపూలే గురుకుల పాఠశాలలో వెలుగుచూసింది.
పదో తరగతి విద్యార్థులకు చెందిన పుస్తకాలు తీసుకున్నారని 6, 7, 9వ తరగతులకు చెందిన 15 మంది విద్యార్థులను కర్రతో విచక్షణరహితంగా కొట్టాడు. ప్రిన్సిపల్ దారుణంగా చితకబాదడంతో విద్యార్థులకు చర్మం కమిలిపోయి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదుచేస్తామని తల్లిదండ్రులు హెచ్చరించారు.
పదో తరగతి విద్యార్థులు సోమవారం పరీక్షలు రాసేందుకు సోమవారం పాఠశాల నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్లారు. 7,8,9 తరగతులకు చెందిన కొంతమంది విద్యార్థులు పదో తరగతి విద్యార్థులుంటున్న హాస్టల్గది తాళాలు పగులగొట్టి.. ఆ గదిలో ఉన్న పదో తరగతివిద్యార్థుల నోట్బుక్స్తోపాటు వారికిసంబంధించిన పలువస్తువులను ఎత్తుకెళ్లగా.. ఈ క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
గురుకుల విద్యార్థులను వాతలు వచ్చేలాగా చితకబాదిన ప్రిన్సిపల్
గద్వాల్ – ఉండవెల్లి మండలంలో అలంపూర్ చౌరస్తాలోని మహాత్మ జ్యోతిరావు బాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులను విచక్షణరహితంగా చితకబాదిన ప్రిన్సిపల్
పదో తరగతి విద్యార్థులకు చెందిన పుస్తకాలు తీసుకున్నారని 6, 7, 9వ తరగతులకు చెందిన… pic.twitter.com/J9cTVBH0Xr
— Telugu Scribe (@TeluguScribe) April 14, 2026
Read Also :
Ambedkar Jayanti | తెలంగాణభవన్లో అంబేద్కర్కు ఘన నివాళులు.. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్
Alia Bhatt | ‘డ్రాగన్’ కోసం ఆలియా?.. ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!
KTR | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు చేసిన మోసాన్ని ఎండగడుదాం : కేటీఆర్
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

