Food Commission | మహబూబ్ నగర్ అర్బన్ : రాష్ట్ర ఫుడ్ కమిషన్ పాలమూరు జిల్లాలో గురువారం, శుక్రవారం రెండు రోజులపాటు పర్యటించనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర పుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు జడ్చర్లకు చేరుకుంటారన్నారు.
జడ్చర్లలో రేషన్ షాపులు, అంగన్వాడీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పాఠశాలలను క్షేత్రస్థాయిలో సందర్శించనున్నారు. జడ్చర్లలో రాత్రి బస చేసి 21 వ తేదీ ఉదయం 11 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు వెంకటేష్ వెల్లడించారు.
Warangal | కేంద్రం బడ్జెట్ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా
Swami bodhamayananda | ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత : స్వామి బోధమయానంద
Robbery | బైనపల్లి ఆలయంలో చోరీ.. హుండీ ధ్వంసం చేసి నగదు, ఆభరణాలు అపహరణ