పాలమూరు: గత కొన్ని రోజులుగా మహబూబ్నగర్ రూరల్ మండలం కోటకదిర పీఏసీఎస్ సహకార సంఘం వద్ద, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎరువుల (Urea) కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఒక్కసారి ఒక్క లారీ యూరియా వస్తుంది. అందులో 150 బ్యాగులు రాగా ఒక్కొక్కరికి 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. అయితే యూరియా కోసం 3 వందల నుంచి 4 వందల మంది రైతులు వస్తున్నారు. వారికి సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులపై వివక్ష చూపకుండా తగిన ఎరువులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని, కాంగ్రెస్ పాలనలో రైతులకు ఎరువుల కొరత ఏర్పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చిన టైంలో సరిగా ఎరువు అందలేదంటే నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు తగిన ఎరువులు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
Mahabubnagar | ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎరువుల కోసం అన్నదాతల అగచాట్లు..
Chennaraopet | యూరియా కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరిన రైతులు