మహబూబ్‌నగర్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర సరిహద్దులో కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నా నీటిని పూర్తిస్థాయిలో పారించుకోలేని దుస్థితి.. సరైన సమయంలో నీటిని ఎత్తిపోసుకోకపోవడంతో చెరు వులు, వాగులు ఒట్టి బోయాయి. దీంతో ఉమ్మడి జిల్లా రైతు లు, ప్రజల ఆశలు అడుగంటాయి.
కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది ఉప్పొంగింది. ఈ సీజన్లో 48 గంటల్లోనే జూరాల డ్యాం, 12 రోజులకే శ్రీశైలం ప్రాజెక్టు నిండిందంటే ఎంత వేగంగా తరలివచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఎగువ నుంచి ఫుల్‌గా వరద జలాలు వస్తుండడంతో 40కిపైగా జూరాల గేట్ల ద్వారా నిత్యం 3 లక్షల క్యూ సెక్కులు దిగువకు అధికారులు విడుదల చేస్తు న్నారు. మరోవైపు తుంగభద్ర నదికి కూడా ఇదే స్థా యిలో వరద పొంగుతున్నది. రెండు నదుల సంగ మంతో తీర ప్రాంతాలు జలకళను సంతరించు కుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం వద్ద నీటి విడుదల ప్రారంభం కాగానే ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు సాగునీటి విడుదలను ప్రారంభించేవారు. ఎగువ నుంచి వరద జూరాలకు చేరేలోపే భీమా ఫేజ్-1, ఫేజ్-2, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు పథకాలకు నీటిని ఎత్తిపోసేటోళ్లు.. వాటితో పాటు ఎత్తిపోతల పరిధిలో ఉన్న గొలుసుకట్టు చెరువులకు కాల్వలు, వాగుల ద్వారా నీటిని పారించేటోళ్లు.. జూరాల పూర్తి స్థాయిలో నిండగానే ఎంజీ కేఎల్ లిఫ్ట్ పంపులు ప్రారంభమ య్యేవి. అన్ని రిజర్వాయర్లను నింపు కొం టూ.. చెరువులకు నీరు చేరేది. నారాయణపేట జిల్లాలో సుమారు 250 చెరువులకు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 400కుపైగా చెరు వులు, మ హబూబ్‌నగర్ జిల్లాలో 110 చెరువులు, నాగర్‌కర్నూల్ జిల్లాలో మరో 400 చెరువులను, వనపర్తి జిల్లాలో ఇటు భీమా ఫేజ్-2, ద్వారా అటు జూరాల ఎడ మ కాల ద్వారా, ఎత్తిపోతల పథకాల ద్వారా 500 కుపైగా చెరువులను కృష్ణానది
నీటితో నింపేవారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో లక్షలాది క్యూసెక్కులు వృథాగా సముద్రం పాలవుతున్నది. నారాయణపేట జిల్లాలో ఉన్న భీమా ఫేజ్-1, గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు, మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు ఆలస్యంగా నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఫలితంగా 20 రోజుల నుంచి జూరాల డ్యాం గేట్ల నుంచి వరద దిగువకు పారుతున్నా.. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసినా.. మనం పూర్తిస్థాయిలో నీటిని సద్వినియోగం చేసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. చెరువులకు నీళ్లు మళ్లించడం మాత్రం పాలకులు మరిచారని ధ్వజమెత్తుతున్నారు.
ఇప్పటికే ఈసారి వర్షాలు అంతంత మాత్రంగానే కురవడం.. ప్రాజెక్టులు నిండుగా పారుతున్నా చెరువులన్నీ బోసిపోయాయి. ఉమ్మడి జిల్లాలో పెద్దదైన దుందుభీ నది ప్రవాహం లేక ఎదురుచూస్తున్నది. అలాగే కళకళలాడే కందూరు వాగు పరిస్థితి అలాగే ఉన్నది. ముందుగానే నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఉంటే వరద వృథాగా పోయేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందుచూపుతో వ్యవహరించాల్సిన కాంగ్రెస్ సర్కారు మాత్రం చోద్యం చూస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో వానకాలం సీజన్‌కు సాగునీటి రాక కష్టంగా మారింది.
ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే యాసంగి నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే అధికారులు మాత్రం రాష్ట్ర సర్కారు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, అదంతా ప్రాసెస్ ప్రకారం చెరువులకు నీళ్లు వదులుతామని పేర్కొంటున్నారు. 20 రోజుల నుంచి లక్షలాది క్యూసెక్కుల నీరు సాగరం వైపు వెళ్తుంటే అధికారులు మాత్రం ఆదేశాల పేరుతో కాలయాజన చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లాలో చెరువుల్లో పూర్తిస్థాయిలో నీళ్లు ఎక్కడా కనిపించడం లేదు. మొత్తం 2 వేలకుపైగా చిన్నా, పెద్ద చెరువులు ఉన్నాయి. ఎంజీకేఎల్ ద్వారా ప్రతి సంవత్సరం నాలుగు వందలకుపైగా చెరువులను నీటితో నింపేవారు. ఈ వర్షాకాలంలో కురుస్తున్న వానలతో ఆశించిన మేర నీళ్లు చేరలేదు. చాలా వరకు చెరువుల్లో 50 శాతం నీరు కూడా చేరలేదు. గుడిపల్లి రిజర్వాయర్ ద్వారా గత వారం నీటిని విడుదల చేయడంతో ఇప్పుడిప్పుడే కాల్వల్లో నీరు చేరుతున్నది. నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాల్లో చెరువుల్లోకి నీటి విడుదల ప్రారంభమైంది. అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాలకు ఇంకా చేరలేదు. శ్రీశైలానికి వరద భారీగా వస్తుండడం.. ఎంజీకేఎల్ పంపులు నడుస్తుండడంతో రాబోయే నెల రోజుల్లో చెరువుల్లోకి నీళ్లు చేరే అవకాశం ఉన్నది. దుందుభీ బోసిపోయింది.
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి కృష్ణానదికి భారీగా వరద చేరుతుండడంతో భీమా ఎత్తిపోతల ద్వారా మక్తల్ నియోజకవర్గంలోని భూత్పూర్, సంగంబండ, రామన్‌పాడు రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఊట్కూర్ మం డలం మినహా కృష్ణ, మాగనూర్, మక్తల్, నర్వ, ఆత్మకూర్, అమరచింత మండలాల పరిధిలోని 150 గొలుసుకట్టు చెరువులకు రిజర్వాయర్ల ద్వారా నీరు చేరాల్సి ఉన్నది. వీటి పరిధిలో 1.20 లక్షల ఎకరాలకు నీరు అందాలి. భూత్పూర్ రిజర్వాయర్ 3.317 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నిండుకోగా ఇప్పటివరకు కాల్వల ద్వారా 50 శాతం చెరువులకు మాత్రమే సాగునీటిని వదులుతున్నామని చెబుతున్నా.. వాస్తవానికి అందుకు విరుద్ధంగా పరిస్థితి ఉన్నదని రైతు లు చెబుతున్నారు. 2.317 టీఎంసీల సామర్థ్యం ఉన్న సంగంబండ రిజర్వాయర్‌కు ఆలస్యంగా నీటిని వదలడంతో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నిండక 1.317 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఈ రిజర్వాయర్ ద్వారా నర్వ, మక్తల్, మాగనూర్ చెరువులకు సాగునీటిని అందించకపోవడంతో ఆయకట్టు రైతులు వరి పంట సాగు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం చెరువులు 561 ఉన్నాయి. ఇందులో కొన్ని వర్షాధారంగా నిండేవి కాగా.. మరికొన్ని నెట్టెంపాడు ద్వారా వచ్చే నీటితో నిండనున్నాయి. అయితే ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో అన్ని చెరువులకు నీరు పారుతున్నది. ప్రస్తుతం రిజర్వాయర్ నుంచి కాల్వలకు విడుదల చేయడంతో చెరువుల్లోకి ఇప్పుడిప్పుడే వచ్చి చేరుతున్నది. ఆలంపూర్ నియోజకవర్గంలో ఆర్డీఎస్ కాల్వకు నీటిని విడుదల చేయడంతో అక్కడి నుంచి చెరువులకు పారుతున్నది. అంతేగానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేకంగా చెరువులను నింపడం లేదని రైతులు పేర్కొంటున్నారు. నీరులేక ధరూర్ మండలం మన్నాపురం చెరువు ఎండిపోయింది. అలంపూర్ నియోజకవర్గంలో 64 చెరువులు ఉండ గా అయిజ మండలం మినహా మిగతా ఏ మండలాల్లోని చెరువులకు నీరు చేరలేదు. రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో నీరు చేరే అవకాశం ఉన్నది.
వర్షాలు ఆశించిన స్థాయి లో కురకవపోడంతో రిజర్వా యర్ల కింద చెరువులకు సా గునీరు అందించడం ఆల స్యమవుతున్నది. భూత్పూ రు రిజర్వాయర్ 3.317 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యంతో నిండింది. సంగంబండ రిజర్వార్‌కు ఒక టీఎంసీ నీళ్లు కావాల్సి ఉన్నది. యాభై శాతం కెనాల్ లింకింగ్ చెరువులకు సాగు నీటిని పంపింగ్ చేశాం. పూర్తి స్థాయిలో చెరువులు నిండేందుకు మరో వారం పట్టే అవకాశం ఉన్నది.
– సంజీవ్ ప్రసాద్, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్, నీటిపారుదల శాఖ