న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్‌ను జనన ధ్రు వీకరణ పత్రంగా ఆమోదించేది లేదని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఉత్తరప్రదేశ్ ప్ర ణాళిక శాఖ జారీ చేసిన ఆదేశాల్లో, “ఆధార్ కార్డ్‌లను ఇకపై జనన ధ్రువీకరణ పత్రాలుగా లేదా జనన తేదీ రుజువుగా ఆమోదించేది లేదు. ప్రణాళిక శాఖ అన్ని శాఖలకు ఆదేశాలను జారీ చేసింది.
ఆధార్ కార్డ్‌కు జనన ధ్రువీకరణ పత్రా న్ని జత చేయలేదు; కాబట్టి ఆధార్ కార్డ్ ను జనన ధ్రువీకరణ పత్రంగా పరిగణించరాదు” అని తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టింది. రెవెన్యూ శాఖ ఇచ్చిన నోటిఫికేషన్లో, 2023 ఆగస్ట్‌లో జరిగిన రివిజన్ తర్వాత కేవలం ఆధార్ ప్రాతిపదికపై జారీ చేసిన జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను చెల్లనివిగా ప్రకటించింది. ఫేక్ బర్త్ సర్టిఫికెట్లను కట్టడి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.