కౌడిపల్లి, నవంబర్ 28: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు 40మంది మాజీ మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్, బీజేపీ విధానాలు నచ్చక ఆ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని హరీశ్‌రావు, సునీతారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి అటకెక్కిందన్నారు. సంక్షేమాన్ని రేవంత్ సర్కారు మరిచిందన్నారు. మాజీ జడ్పీటీసీలు అమర్‌సింగ్, కొండల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సాయిలు, సాయాగౌడ్, చంద్రయ్య, మధుసూదన్‌గౌడ్, మహేశ్‌గౌడ్, యాదుల్, తీగల శంకర్,కుండలి శేఖర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి 40మంది బీఆర్ఎస్లో చేరారు. చేరిన వారిలో సండ్రుగు శ్రీనివాస్, బక్క నర్సాగౌడ్, పంబాల నవీన్, భిక్షపతి, కిశోర్, కదీర్, గొల్ల మహేశ్ తదితరులు ఉన్నారు.
కొల్చారం, నవంబర్ 28: మండలంలోని పైతర గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు నర్సాపూర్ ఎంఎల్ఎ సునీతా లక్ష్మారెడ్డి ఆద్వర్యంలో శుక్రవారం నర్సాపూర్‌లోని ఎంఎల్ఎ నివాస గృహం వద్ద బీఆర్ఎస్లోకి చేరారు. పైతర మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ వార్డు మెంబర్లు కె.రామచందర్, ఈ.మల్లేశం, సీనియర్ నాయకులు బట్టి మోహన్, బి.నర్సింహులు, నాగరాజులతో కలిసి మొత్తం 20 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీ శంకర్, యువత విభాగం అధ్యక్షుడు సంతోష్‌రావు, యువ నాయకులు రవితేజ రెడ్డి తదీతరులు ఉన్నారు.
రేగోడ్, నవంబర్ 28: బీఆర్ఎస్లో భారీగా చేరికలు జరిగాయి. మండల ప్రధాన కార్యదర్శి రమేశ్ మాట్లాడతూ శుక్రవారం కొత్వాల్‌పల్లి గ్రామస్తులు మాజీ ఎమ్యెల్యే క్రాంతికిరణ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుధాకర్, సురేందర్, సావిత్రి, రమేశ్, దశరథ్ నాయక్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని ఆయన తెలిపారు. మాజీ సర్పంచ్ రవీందర్, పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, విజయ్ తదితరులు ఉన్నారు.
కోహీర్, నవంబర్ 28: ఎన్నికల హామీల అమలులో విఫలం చెందడంతో కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని నాగిరెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అల్లిపురం సురేశ్ తన అనుచరులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి మెడలో గులాబీ కుండువా వేసి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు, మాజీ సర్పంచ్ కృష్ణ, నాయకులు బాబు, నర్సింహులు, అడివయ్య, ప్రవీణ్, సాయిలు, రవికుమార్, ఆనందం, గోపాల్, మల్లేశం, అశోక్, యాదవులు పాల్గొన్నారు.