బీసీ సాహిత్య వేదిక, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాలులో ‘బీసీ కులవృత్తుల దీర్ఘకవితలు’పై సదస్సు నిర్వహిస్తున్నదని బీసీ సాహిత్య వేదిక కన్వీనర్లు వనపట్ల సుబ్బయ్య, సంగిశెట్టి శ్రీనివాస్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. సభాధ్యక్షుడిగా డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, ముఖ్య అతిథులుగా జూలూరు గౌరీశంకర్, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, విశిష్ట అతిథులుగా నామోజు బాలాచారి, తిరునగరి దేవకీదేవి, కె.ఆనందచారి పాల్గొంటారని తెలిపారు.
మొదటి సదస్సులో సభాధ్యక్షుడిగా కాంచనపల్లి గోవర్ధనరాజు, ముఖ్యఅతిథిగా డా.పిల్లలమర్రి రాములు, విశిష్ట అతిథులుగా కందుకూరి శ్రీరాములు, ఆత్మీయ అతిథిగా జ్వలిత పాల్గొంటారని పేర్కొన్నారు. రెండవ సెషన్లో సభాధ్యక్షుడిగా రామోజు హరగోపాల్, ముఖ్యఅతిథిగా బెల్లియాదయ్య, విశిష్ట అతిథిగా నాళేశ్వరం శంకరరం, ఆత్మీయ అతిథిగా వంగర త్రివేణి వ్యవహరిస్తారని తెలిపారు. ముగింపు సమావేశానికి సభాధ్యక్షుడిగా వనపట్ల సుబ్బయ్య, ముఖ్యఅతిథిగా డా.సీతారాం, విశిష్ట అతిథులుగా గాజోజు నాగభూషణం, బెల్లంకొండ ప్రసేన్, ఆత్మీయ అతిథులుగా డా.పెబ్బేటి మల్లికార్జున్, డా.భీంపల్లి శ్రీకాంత్ వ్యవహరిస్తారని తెలిపారు. వివరాలకు 9492765358, 9849220321 నెంబర్లలో సంప్రదించవచ్చునని సూచించారు.
ఆసిఫాబాద్ కవుల సంఘం (ఆకసం) ఆధ్వర్యంలో నల్లగొండ రమేశ్ రచించిన ‘దిగులు ద్వీపం’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఆసిఫాబాద్ సత్యసాయిబాబా మందిరంలో ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు జరుగుతుందని సంఘం ప్రతినిధి కందుకూరి శ్రీరాములు తెలిపారు. ఈ పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి ఆవిష్కరిస్తారని తెలిపారు. వివరాలకు 9440119245 నెంబర్లో సంప్రదించవచ్చునని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు దుఃఖభరిత సన్నివేశాలను నిరసిస్తూ.. బాధితులకు సంఘీభావంగా, ఉగాది రోజున ‘వెలుగుమట్ల ‘నామ సంవత్సర-కుమ్మెర కవితా గానం’ అనే అంశంపై 33 జిల్లాల్లో కవి సమ్మేళనం నిర్వహించనున్నామని బీసీ రచయితల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ గాజోజు నాగభూషణం తెలిపారు. కవి సమ్మేళనం తర్వాత ఆయా కవితల్ని ఒక పుస్తకంగా తీసుకువస్తామని పేర్కొన్నారు.