ఇరాన్ నుంచి భారత్‌కు చేరుకున్న విద్యార్థులు
యుద్ధ సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్ నుంచి భారత విద్యార్థులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. ఆదివారం 70 మందికిపైగా భారతీయ విద్యారులు ఇరాన్ నుంచి దుబాయ్‌కు వచ్చి, అక్కడ్నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.
న్యూఢిల్లీ, మార్చి 15 : యుద్ధ సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్ నుంచి భారత విద్యార్థులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. ఆదివారం 70 మందికిపైగా భారతీయ విద్యారులు ఇరాన్ నుంచి దుబాయ్‌కు వచ్చి, అక్కడ్నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. వైద్య విద్యను అభ్యసించేందుకు ఇరాన్‌కు వెళ్లిన వీళ్లంతా యుద్ధ సంక్షోభంలో చిక్కుకోవటంతో, భారత ప్రభుత్వ సమన్వయంతో విద్యార్థులను సురక్షితంగా తరలించే ప్రక్రియను ఇరాన్‌లోని మన రాయబార కార్యాలయం చేపట్టింది.
ఇందులో అత్యధిక మంది జమ్ముకశ్మీర్‌కు చెందిన వాళ్లే ఉన్నట్టు మీడియా కథనాలు తెలిపాయి. వీరంతా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత తమ స్వస్థలాలకు బయల్దేరారు. ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ మోమిన్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం, టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సుమారు 1,200 మంది భారతీయులు విద్యనభ్యసిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | మారిన మద్దతు లెక్కలు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ‘మిషన్ 360’
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

