మహబూబ్‌నగర్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు జిల్లా కేంద్రం రెండు రోజులపాటు ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ కార్లకు వేదిక కానున్నది. ఈనెల 29, 30వ తేదీల్లో జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్లో రెండ్రోజుల పాటు భారీ ఎత్తున ఆటో ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ దినపత్రికల సంయుక్త ఆధ్వర్యంలో వాహనాల మేళా జరగనున్నది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన హై క్లాస్ అరేంజ్ కార్లతోపాటు మధ్య తరగతి జనానికి నచ్చే.. మెచ్చే కార్లకు.. వాహనాలను ఇందులో ప్రదర్శించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర ంలో కనీవిని ఎరగని రీతి లో నిర్వహించనున్న ఈ కార్ల మేళాలో బీఎండబ్ల్యూ, స్కోడా, టయోటా హైబ్రీడ్, లోకల్ మారుతి ఆరేనా, నెక్సా.. హ్యుందాయ్, మహేంద్ర కార్లతోపాటు బైకులు, ఎలక్ట్రికల్ వాహనాలు కూడా కొలువు దీరబోతున్నాయి.
ఈ ఎక్స్‌పోలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మహేంద్ర ట్రాక్టర్ ఓజో కూడా రైతు సోదరులకు సరికొత్త రీతిలో కనువిందు చేయ నున్నది. దీంతోపాటు మధ్య తరగతి వారికి తక్కువ వడ్డీతో బ్యాంకుల్లో ఎలా రుణాలు తీసుకోవాలో తెలియజేసేందుకు ఎస్బీఐ, యూనియన్ బ్యాంకులు భాగస్వామ్యం కానున్నాయి. ప్రసిద్ధ బ్రాండెడ్ కార్ల కోసం ఎప్పుడు హైదరాబాద్‌కు పరుగులు పెట్టాల్సిన అవసరం లేకుండానే మహబూబ్‌నగర్‌లో రెండ్రోజులపాటు ఆటో ఎక్స్పో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
పాలమూరులో ఆటో ఎక్స్పో బ్రాండెడ్ కార్ల కొనుగోలు కోసం ఇపడు హైదరాబాద్‌కు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆసక్తి ఉన్న వారు పాలమూరులోనే వీటిని సొంతం చేసుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’, ’తెలంగాణ టుడే’ సువర్ణావకాశం కల్పిస్తున్నది. దాదాపు 20కిపైగా కంపెనీల ఉత్పత్తులు ఒకే వేదికపైకి రానుండడంతో వాటిలో నచ్చిన వాహనాలను కొనుగోలు చేసుకునే అవకాశం ప్రజలకు ఆటోషో ద్వారా లభించనున్నది. కొనుగోలుదారులకు లోన్ సౌకర్యం కల్పించేందుకు వివిధ బ్యాంక్‌లు సైతం అందుబాటులో ఉండనున్నాయి.
ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంకు లు ఆటో షోలో తమ స్టాల్స్ ఏర్పా టు చేయనున్నాయి.. ప్రతిష్టాత్మకమైన విలాసవంతమైన కార్లకు కూడా వేదిక కానున్నది. వెనుకబడిన పాలమూరు జిల్లా కేంద్రం లో బీఎండబ్ల్యూ, స్కోడా వంటి బడా కార్ల షోరూ ంలు లేవు.. హైదరాబాద్‌కు వెళ్లాల్సిందే.. అలాంటి కార్లను కూడా ఈ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబోతున్నారు. వినియోగదారులు తమకు నచ్చిన కార్లతోపాటు ద్విచక్ర వాహనాలు ఎలక్ట్రికల్ వాహనాలు స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నాయి. ఒకే వేదికపై ఎలక్ట్రికల్ బైకులు స్టైల్, ఫీచర్స్, పేరెన్నిక గల బైక్‌లను ఆటోషోలో అందుబాటులో ఉంచుతున్నారు. టీవీఎస్, పాపులర్ బైక్స్‌ను ప్రదర్శించనున్నారు. ఎథర్, తదితర ఎలక్ట్రికల్ బైక్‌లు సైతం కొలువుదీరనున్నాయి. హీరో, హోండా, బజాజ్ కంపెనీల బైక్‌లను ప్రదర్శించబోతున్నారు.
కస్టమర్లకు లక్కీచాన్స్ ‘నమస్తే తెలంగాణ’ ద్వారా ఏర్పాటు చేయబోయే ఆటో ఎక్స్‌పోలో విలాసవంతమైన కార్లతోపాటు ఇతర ద్విచక్ర వాహనాలు.. ట్రాక్టర్లను ప్రదర్శించబోతున్నారు. వినియోగదారులు ఇప్పుడు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అన్ని రకాల బ్రాండెడ్, లగ్జరీ కార్లతోపాటు మధ్య తరగతి వారికి అవసరమైన కార్లను ఈ ఆటో ఎక్స్‌పోలో చూడవచ్చు. అంతేకాకుండా తమకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేసుకునే వెసులుబాటుతోపాటు.. వివిధ బ్యాంకుల్లో కూడా తక్కువ వడ్డీతో రుణ సదుపాయం పొందవచ్చు. అవసరమైన వాటిని కూడా టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు. పాలమూరు జిల్లా కేంద్రంలో ఆర్థికంగా ముందుకు వెళుతున్న.. కార్ల షోరూంలకు వెళ్లి తెలుసుకుని వెసులుబాటు కన్నా ఈ ఎక్స్‌పోలో అన్ని రకాల కార్లతో పాటు ద్విచక్ర వాహనాల వెరైటీలను చూసి ఏది కొనాలో డిసైడ్ చేసుకునే అవకాశం వినియోగదారులకు కలగనున్నది. రెండ్రోజులపాటు జరిగే ఆటో మేళాను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
వినియోగదారులకు చౌక ధరల్లో లగ్జరీ బ్రాండెడ్ కార్ల ఫీచర్లతో మారుతి సుజుకీకంపెనీ దేశంలోనే ఆటో ఇండస్ట్రీ గ్రోత్ ను పెంచుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం కారులపై జీఎస్టీని తగ్గించడంతో రెండు నెలల్లో మారుతి కార్ల విక్రయం ఆల్‌టైం రికార్డులు సాధించింది. కేంద్రం జీఎస్టీ తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు టాక్స్ పెంచడంతో కొంత ఇబ్బంది కలిగిన ప్రభుత్వం మధ్యతరగతి వాళ్లను దృష్టిలో పెట్టుకొని వచ్చే మార్చి ఏప్రిల్ వరకు రోడ్డు ట్యాక్స్‌ను పెంచొద్దని కోరుతున్నాం. మధ్యతరగతి ప్రజలకు కూడా లగ్జరీ కార్ల వైపు మళ్లించాలని నెక్సా ఫీచర్లను పెంచుతున్నాం.
అదే నా మోడల్ కార్ షోరూమ్‌లో కూడా ప్రమాణాలు పెంచాం. భవిష్యత్తులో ఎలక్ట్రికల్ ఈవీ చార్జింగ్ పాయింట్లు ప్రతి షో రూమ్‌లో పెట్టాకే డిసెంబర్ నుంచి ఎలక్ట్రికల్ రంగంలోకి మారుతున్నాం. ప్రతి మండల కేంద్రానికి సర్వీస్ వెళ్లాలని ఉద్దేశంతో రాబోయే రోజుల్లో మరో వంద బ్రాంచులను ఏర్పాటు చేస్తున్నాం. టయోటా మారుతి కాంబినేషన్లో త్వరలో హైబ్రిడ్ టెక్నాలజీతో కార్ల రంగంలో దూసుకుపోనున్నాం. మధ్యతరగతి ప్రజల ఆకాంక్షల మేరకు మారుతీ కంపెనీ ముందుకు వెళుతోంది. పర్సనల్ ట్రాన్స్‌ఫోర్టు పెరిగినందున టూవీలర్ నుంచి ఫోర్ వీలర్‌కు మారాలని.. ఎక్కువమంది వినియోగదారులు మారుతి కంపెనీ వైపు చూస్తున్నారని, వారి ఆకాంక్షల మేరకు సర్వీసును ప్రజల చెంతకు చేరుస్తాం.
– బెక్కరి రాంరెడ్డి, ఎండీ, శ్రీరామ, జయరామ షోరూం, మహబూబ్‌నగర్