జడ్చర్ల టౌన్, నవంబర్ 27 : తమకు అ నుకూలంగా సెటిల్మెంట్ చేయలేదన్న నెపం తో ఓ కాంగ్రెస్ నేత తన అనుచరులతో కలసి ఏకంగా పోలీస్ స్టేషన్లోనే రచ్చ రచ్చ చేయడంతోపాటు విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌పై బూత్ పురాణం మొదలుపెట్టి.. అడ్డొచ్చిన ఎస్సై, మిగతా సిబ్బందిపై దాడికి య త్నించిన ఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసుల కథ నం మేరకు.. భూత్పూర్ మండలం మద్దిగట్లకు చెందిన చెన్నకేశవులుకు చెందిన కారు ను ఈనెల 16 తేదీన జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి, మల్లెబోయిన్పల్లి శివారులో హైవే-44పై ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీకొనగా కారు దెబ్బతిన్నది. చెన్నకేశవులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజు పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా ఆయిల్ ట్యా ంకర్ను గుర్తించి పీఎస్‌కు తరలించారు.
హైదరాబాద్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్ యాజమాని మురళీకృష్ణను పిలిపించి సెటిల్మెంట్ చేయాలని గురువారం కారు యాజమానితోపాటు కొందరు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ట్యాంకర్ యాజమానిని పిలిపించామని, ఏదైనా సెటిల్మెంట్ ఉంటే బయట చేసుకోవాలని పోలీసులు సూచించారు. పోలీసులు సెటిల్మెంట్ చేయలేదంటూ భూ త్పూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులతో పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఆ గ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న కానిస్టేబుల్ భీమయ్యపై దురుసుగా ప్రవర్తించాడు. నీవు ఎవడివిరా.. బయటకు రా.. నీ అంతు చూస్తామం టూ బెదిరించగా, అక్కడే ఉన్న మరో కానిస్టేబల్ లక్ష్మప్ప జోక్యం చేసుకోగా.. అతడిని సై తం దూషించాడు. ఎస్సై జయప్రసాద్ వారించేందుకు యత్నించగా దౌర్జన్యంగా మాట్లాడు తూ ‘నీ ఉద్యోగం ఎంత.. నీ వెంత.. నిన్ను ట్రాన్స్ఫర్ చేయి స్తా’.. అంటూ ఎస్సైపై శ్రీనివాస్‌రెడ్డితో పాటు అతని అనుచరులు దాడికి యత్నించారు.
ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాటలు జరగటంతో శ్రీనివాస్‌రెడ్డిని లాకప్‌లో పెట్టారు. జడ్చర్ల పట్టణ, రూరల్ సీఐలు కమలాకర్, నాగార్జునగౌడ్ అక్కడికి చేరుకొని శ్రీనివాస్‌రెడ్డిని బయటకు తీశారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు సీఐ ఎదుట చర్చలు జరిపారు. ఈ విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అక్కడికి చేరుకొని కాంగ్రెస్ నాయకులను బయటకు తీసుకెళ్లారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు పీఎస్‌కు చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. బాధ్యులైన వారిపై చర్య లు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు.