e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిల్లాలు రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు : ఏసీపీ

రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు : ఏసీపీ

రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు : ఏసీపీ

రాయపర్తి, జూన్‌ 3: రైతులను మోసం చేస్తే భవిష్యత్‌లో ఊసలు లెక్కపెట్టాల్సి వస్తుందని వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్‌ హెచ్చరించారు. గురువారం మండలకేంద్రంలోని విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు దుకాణాల యజమానులకు పోలీస్‌స్టేషన్‌లో సీఐ డీ విశ్వేశ్వర్‌ అధ్యక్షతన అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నందున మండలంలోని సీడ్స్‌, ఫెస్టిసైడ్స్‌ దుకాణాదారులు గుర్తింపు పొందిన విత్తనాలే విక్రయించాలని సూచించారు. అనంతరం మండలకేంద్రంలోని పలు షాపులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏవో గుమ్మడి వీరభధ్రం, ఎస్సై వంశీకృష్ణ, ఏఎస్సైలు సదయ్య, వెంకటేశ్వర్లు, సిబ్బంది సురేశ్‌, చిదురాల రమేశ్‌, బొట్ల రాజు, ఎడ్ల రవీందర్‌, గొళ్లెన రమేశ్‌, తూళ్ల సంపత్‌, కత్తుల శ్రీనివాస్‌, చొల్లేటి హర్షిత, పూర్ణచందర్‌రెడ్డి పాల్గొన్నారు.
నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
దామెర/ఖానాపురం: వర్షాకాలం సీజన్‌లో రైతులకు నాణ్యమైన, గుర్తింపు పొందిన పత్తి విత్తనాలనే విక్రయించాలని ఏవో శ్వేత అన్నారు. దామెర మండలం ఊరుగొండ, దామెర, పులుకుర్తిలో ఫర్టిలైజర్‌, ఫెస్టిసైడ్స్‌ షాపులను తనిఖీ చేశారు. ఖానాపురంలోని విత్తన, ఎరువులు, పురుగు మందుల దుకాణాలను ఏవో భోగ శ్రీనివాస్‌ తనిఖీ చేశారు. షాపుల ఎదుట బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు రసీదులు ఇవ్వాలన్నారు. ఆయన వెంట ఏఈలు నూకల సంతోష్‌, సంధ్య ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు : ఏసీపీ

ట్రెండింగ్‌

Advertisement