ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Mahabubabad - Jan 25, 2021 , 00:39:11

ఆడబిడ్డకు పాదాభివందనం

ఆడబిడ్డకు పాదాభివందనం

  • వీఎంఎఫ్‌లో వినూత్న కార్యక్రమం

తొర్రూరు, జనవరి 24 : ‘ఆడ పిల్లలను పుట్టనిద్దాం, బతుకనిద్దాం, చదివిద్దాం, ఎదగనిద్దాం, మనమంతా అమ్మగా పూజిద్దాం’ అనే నినాదంతో బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివా రం వందేమాతం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో యువకులు, విద్యార్థులు ఆడబిడ్డకు పాదాభివందనంతో ప్రతిజ్ఞ చేశారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని వందేమాతరం ఫౌండేషన్‌ డైరెక్టర్‌ టీ రవీంద్ర పర్యవేక్షణలో నితిన్‌భవన్‌ ఆవరణలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆ డబిడ్డల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను, చట్టాలను తీసుకువచ్చినప్పటికీ భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన సంస్కృతిలో పవిత్రమైన, పూజనీయత కలిగిన స్త్రీలను గౌరవించడం, ఆదరించడం వంటి ఉత్తమ సంస్కారాలను పాఠశాల దశ నుంచే అందించాల్సినవసరం ఉందన్నారు.    

VIDEOS

logo