శనివారం 05 డిసెంబర్ 2020
Mahabubabad - Aug 16, 2020 , 03:28:15

సీఎం కేసీఆర్‌ పథకాలు దేశానికి మార్గదర్శకం

సీఎం కేసీఆర్‌ పథకాలు దేశానికి మార్గదర్శకం

మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి మార్గదర్శకంలా నిలిచాయని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహబూబాబాద్‌ కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కొవి డ్‌-19పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతున్నదని, బంగారు తెలంగాణలో మానుకోట జిల్లాను రోల్‌ మోడల్‌గా చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్‌ పర్సన్‌ ఆంగోతు బిందు, ఎమ్మెల్యే బానోతు శంకర్‌ నాయక్‌, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎస్పీ కోటి రెడ్డి పాల్గొన్నారు.