Tea History | ప్రపంచవ్యాప్తంగా ప్రశస్తమైన పానీయంగా కీర్తి గడించిన తేనీరు చరిత్రను తరచి చూస్తే ఎన్నో మలుపులు, మరెన్నో గెలుపులు కనిపిస్తాయి. పసందైన రుచితో తమను వశపరుచుకున్న తేయాకును కాపాడుకునేందుకు చైనీయులు చేసిన కృషి శ్లాఘనీయమే! పదో శతాబ్దంలో కొన్నేండ్లపాటు చైనాలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయులకు పడిపోయాయి. శీతల గాలుల తీవ్రత కారణంగా జాంగ్సూ ప్రావిన్స్ పర్వత సానువుల్లోని తేయాకు తోటలు మంచు కరుచుకుపోయాయి. వేలాది ఎకరాల్లో తోటలు పనికిరాకుండా పోయాయి. ఈ విపత్తుతో కొన్నేండ్లపాటు చైనాలో తేనీటికి కొరత ఏర్పడిందట.
తేయాకు తోటలు పెంచడానికి జాంగ్సూ ప్రావిన్స్ అనువైన ప్రదేశం కాదని గుర్తించిన అప్పటి పాలకులు.. ఆగ్నేయ తీరప్రాంతంలోని ఫుజియాన్ ప్రావిన్స్‌ను ఎంచుకున్నారు. అక్కడి పర్వత లోయల్లో ప్రత్యేక వసతులతో వేల ఎకరాల్లో తేయాకు తోటలు ఏర్పాటుచేశారట. జియాన్ నది ఒడ్డున కూడా భారీగా తేయాకు సాగయ్యేలా చర్యలు తీసుకున్నారట. తోటల్లోనే తేయాకు ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పారట. తమ మక్కువ తీర్చిన ఉష్ణోదకం దక్కకుండా పోతుందేమోననే బెంగతో తేయాకు సాగు విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు చైనీయులు. పగటి పూట ఆకులు తుంచడం వల్ల మొక్కలకు నష్టం వాటిల్లుతుందని అనుమానించి తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య తేయాకు సేకరణ చేపట్టేవారట! అలా సేకరించిన వాటిని ప్రాసెసింగ్ ద్వారా దళసరి పలకలుగా చేసి అమ్మేవారు. అప్పుడున్న డిమాండ్ దృష్ట్యా అరచేతిలో పట్టే తేయాకు పట్టీ కోసం 40వేల రాగి నాణేలు చెల్లించేవారట తేనీటిప్రియులు. అలా బాలారిష్టాలు దాటుకొని మళ్లీ వేళ్లూనుకున్న తేయాకు మొక్కలు.. ఆ తర్వాత కాలంలో చైనా నుంచి జపాన్ మీదుగా వివిధ దేశాలకు విస్తరించాయి. ఇప్పుడు రంగు, రుచి, వాసనతో ప్రపంచమంతటినీ పరవశింపజేస్తున్నాయి.
కావలసినవి: నీళ్లు: ఒక కప్పు, గ్రీన్ టీ పొడి: ఒక టీ స్పూన్, తేనె: ఒక టేబుల్ స్పూన్, మల్లెపూలు: మూడు
తయారీ: గిన్నెలో నీళ్లు తీసుకొని బాగా మరిగించాలి. ఆ నీళ్లలో టీ పొడి, మల్లెలు వేయాలి. మరో నిమిషం బాగా మరగనివ్వాలి. తర్వాత తేనె వేసుకున్న కప్పులోకి తేనీటిని వడగట్టుకుంటే సువాసనలు వెదజల్లే మల్లె టీ సిద్ధం. జాస్మిన్ టీ వల్ల జీవక్రియలు మెరుగవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జాస్మిన్ టీ పుక్కిలించడం వల్ల దంతక్షయం, చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి. నోటి దుర్వాసనా పోతుంది.
తేనీరు దాహాన్ని మాత్రమే కాదు.. మనసులోని ఆందోళనలనూ పరిమార్చుతుంది.
చైనా నానుడి
“Tea | ఎంత ఇష్టమైనా రోజులో 4 సార్లకంటే ఎక్కువ తాగకపోతేనే మేలు”
“Tea | విషం తిన్న వ్యక్తిని కాపాడిన ఛాయ్.. ఎక్స్పైరీ అయిన టీపొడి కూడా ఆరోగ్యమే !”
Bostan Tea Party | అమెరికాకు స్వాతంత్య్రం రావడానికి టీనే కారణమని తెలుసా
Tea History | వాళ్లే చాలా తెలివిగా మనకు ఛాయ్‌ను అలవాటు చేశారు !!