Bostan Tea Party | అమెరికాకు స్వాతంత్య్రం రావడానికి టీనే కారణమని తెలుసా
Bostan Tea Party | 1773 డిసెంబర్ 16న జరిగిన ఈ సంఘటన ‘బోస్టన్ టీ పార్టీ’గా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఈ సంఘటన జరిగిన దాదాపు పదేండ్లకు 1783లో అమెరికా పూర్తి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ప్రస్తుతం ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా స్వేచ్ఛా వాయువులు పీల్చడంలో చాయ్ది కీలకపాత్ర కావడం తేనీటి ప్రియులకు గర్వకారణం!
Bostan Tea Party | ‘టీ కప్పులో తుఫాన్’ అనే మాట తరచూ వింటుంటాం! ఈ ప్రయోగం వెనుక ఉన్న మతలబు తెలియదు కానీ, టీ పొడి రేపిన ఓ తుఫాన్ అమెరికాకు స్వేచ్ఛను ప్రసాదించడంలో కీలక పాత్ర పోషించింది. ఆంగ్లేయులు అమెరికాను పాలిస్తున్న రోజులవి. పన్నులు వసూలు చేయడమే తప్పించి, పరిపాలనలో తమకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై అమెరికన్లు నిరసనలు వ్యక్తం చేయసాగారు. పన్నులు కట్టకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నిత్యావసర వస్తువుల ధరలను బ్రిటిష్ ప్రభుత్వం అమాంతం పెంచేసింది. దీనికితోడు ‘టీ చట్టాన్ని’ బలవంతంగా వారిపై రుద్దడానికి ప్రయత్నించింది. ఇందుకు వ్యతిరేకంగా అమెరికన్లు ఉద్యమించారు. సన్స్ ఆఫ్ లిబర్టీ సంస్థకు చెందిన ఉద్యమకారులు నేటివ్ అమెరికన్ల వేషధారణలో బోస్టన్ ఓడరేవుపై దండెత్తారు.
ఓడల్లో ఉన్న టన్నులకొద్దీ చాయ్‌పత్తాను సముద్రంలో పడదోసి నీటిపాలు చేశారు. అమెరికన్ల మెరుపుదాడితో బ్రిటిషర్లు స్టన్ అయ్యారు. మాసాచూసెట్స్ పరిధిలో నిర్బంధ చట్టాలను అమలుచేశారు. బోస్టన్ ఓడరేవును మూసివేశారు. నష్టపరిహారం చెల్లించాలని ఒత్తిడి చేశారు. కానీ, సదరు ఓడరేవు దగ్గర తీరం దాటిన ఉద్యమ ‘టీ’ర్నడోలు అమెరికాను చుట్టేశాయి. స్వతంత్ర ఉద్యమ గతిని మార్చేశాయి. 1773 డిసెంబర్ 16న జరిగిన ఈ సంఘటన ‘బోస్టన్ టీ పార్టీ’గా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఈ సంఘటన జరిగిన దాదాపు పదేండ్లకు 1783లో అమెరికా పూర్తి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ప్రస్తుతం ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా స్వేచ్ఛా వాయువులు పీల్చడంలో చాయ్ది కీలకపాత్ర కావడం తేనీటి ప్రియులకు గర్వకారణం!
కశ్మీరీ గవా
కావలసినవి: నీళ్లు: మూడు కప్పులు, ఇలాచీ: ఎనిమిది (చితక్కొట్టి పెట్టుకోవాలి), దాల్చిన చెక్క: అంగుళం, కుంకుమపువ్వు: చిటికెడు, చాయ్‌పత్తా: ఒక టేబుల్ స్పూన్, బాదం: ఆరు (పొడి చేసుకోవాలి), తేనె: పావుకప్పు
తయారీ:
పొయ్యిమీద గిన్నెపెట్టి నీళ్లు పోయాలి. ఇందులో ఇలాచీ పొడి, దాల్చిన చెక్క, కుంకుమపువ్వు, టీపొడి, బాదంపొడి అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా మరిగించాలి. తర్వాత కప్పులో తేనె వేసుకొని అందులోకి తేనీటిని వడగట్టుకుంటే కశ్మీరీ గవా సిద్ధం.
‘టీ’కా తాత్పర్యం
తేనీరు ఉన్న చోట ఆశలు ఊరుతాయి.
– ఆర్థర్ వింగ్ పినేరో ఆంగ్ల నాటక రచయిత
Read More :
Tea History | వాళ్లే చాలా తెలివిగా మనకు ఛాయ్‌ను అలవాటు చేశారు !!
“Green Tea | జుట్టు ఎక్కువగా రాలిపోతున్నప్పుడు గ్రీన్ టీ తాగొచ్చా?”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

