Dropout Chaiwala | చదువు కోసం నెల్లూరు నుంచి ఆస్ట్రేలియా వెళ్లి.. ఛాయ్ అమ్ముకుంటున్నాడు.. కోట్లు సంపాదిస్తున్నాడు
Dropout Chaiwala | నెల్లూరు వాసి సంజిత్ కొండా ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ (బిజినెస్ అడ్మినిస్ట్రేషన్)లో చేరాడు. కోర్సు పూర్తిచేయడంలో విఫలమవ్వడంతో తనకు ఇష్టమైన టీనే నమ్ముకున్నాడు! 22 ఏళ్ల వయసులో పక్కా చాయ్‌వాలాగా మారిపోయాడు.
Dropout Chaiwala | బాగా చదవాలి. పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయాలి. జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలి. ..ఇలా కలలు కనడమే కాదు వాటిని సాకారం చేసుకునేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు సంజిత్ ( Sanjith Konda ). కానీ, ఆ ఆలోచనలన్నీ పక్కదారి పట్టాయి. చదువు మధ్యలోనే ఆగిపోయినా.. లక్ష్యం మాత్రం గురి తప్పలేదు. చదువు కంటే చాయ్ ముఖ్యమని నిర్ణయించుకున్న సంజిత్ ఇప్పుడు మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల కంపెనీకి అధిపతి!
సంజిత్ కొండా.. నెల్లూరు వాసి. ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ (బిజినెస్ అడ్మినిస్ట్రేషన్)లో చేరాడు. మధ్యలో వైట్ కాలర్ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేశాడు. కానీ, అవకాశం రాలేదు. దీంతో కోర్సు పూర్తిచేయడంలో విఫలంఅయ్యాడు. మరో అవకాశం కోసం ఎదురు చూడకుండా.. తనకు ఇష్టమైన టీనే నమ్ముకున్నాడు! 22 ఏళ్ల వయసులో పక్కా చాయ్‌వాలాగా మారిపోయాడు.
మెల్బోర్న్ నగరం కాఫీప్రియుల స్వర్గధామం. మంత్రముగ్ధుల్ని చేసే రకరకాల కాఫీలకు ప్రసిద్ధి. అక్కడే చాయ్‌తోపాటు సమోసాలు అమ్ముతూ తన అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు సంజిత్. మెల్బోర్న్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని ఎలిజెబెత్ వీధి ఆదివారాలు మహారద్దీగా ఉంటుంది. ఇక్కడ భారతీయులు, ఆస్ట్రేలియన్లు తమకు ఇష్టమైన టీ, కాఫీలు తాగుతూ సంతోషంగా గడుపుతారు. ఆ జన సందోహం మధ్యలో ‘డ్రాపవుట్ చాయ్‌వాలా’ వెలసింది. మెల్బోర్న్లోని భారతీయులకు ఇదే అతిపెద్ద అడ్డా.

చాయ్పుచినో
ఇండియాలో బాంబే కటింగ్ చాయ్ ఎలాగో, ఆస్ట్రేలియాలో మసాలా చాయ్ అలా! పక్కన, నంజుకోవడానికి పకోడీలుంటే అదుర్స్. ఆ క్రేజ్‌కు, డిమాండ్‌కు తగ్గట్టు సంజిత్ తన వ్యూహాలను సిద్ధం చేసుకున్నాడు. కాఫీలో ‘క్యాపుచినో’లా, ‘చాయ్పుచినో’ అనే చాయ్‌ని రంగంలోకి దించాడు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఫ్యూజన్ గ్రీన్ టీ, చాయ్పుచినోను చాయ్‌వాలా పరిచయం చేసింది. ఇండియన్ టీ రుచిని ఇష్టపడే ప్రవాస భారతీయుల కోసం ఇక్కడ పండిన టీపొడిని ఆస్ట్రేలియాకు దిగుమతి చేసుకుంటున్నాడు.
అనుకోకుండా..
సంజిత్ అనుకోకుండా చాయ్‌వాలా అయ్యాడు. అతి తక్కువ కాలంలోనే అనుకోనంత డబ్బు సంపాదించాడు. ఏడాది తిరిగేసరికి తన కంపెనీ ‘డ్రాపవుట్ చాయ్‌వాలా’ మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. త్వరలోనే మరో ఔట్లెట్ ప్రారంభిస్తానని, అలాగే ఆస్ట్రేలియాలోని ప్రతి నగరంలోనూ ఒక ఔట్లెట్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్నానని సంజిత్ చెబుతున్నాడు. మూలాల మీద ప్రేమతో తను భారతీయ విద్యార్థులకు పార్ట్‌టైమ్ జాబ్స్ ఇస్తున్నాడు. ‘చాయ్వాలాలో డిగ్రీలు చూసి ఉద్యోగాలు ఇవ్వను. పనిపట్ల ఇష్టం, కష్టపడే తత్వం ఉంటేనే కొలువులో తీసుకుంటాను. కానీ, ఇష్టమైతేనే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయమని యువతకు నేను సలహా ఇస్తుంటాను. లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించి.. లక్ష్యానికి దూరంగా అర్థంలేని కొలువులు చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఆ కొలువునే ఓ చదువుగా భావిస్తానంటే మరీ సంతోషం’ అంటాడు సంజిత్. చదువుల సంగతి పక్కనపెట్టి, సిగ్గుపడకుండా పనిచేస్తే జీవితంలో ఎదగాలనుకున్న దానికంటే ఎక్కువే ఎదగవచ్చని సంజిత్ విజయం రుజువుచేస్తున్నది.
ఇష్టమైన పనిలో ఎన్ని విజయాలో.. !
చిన్నప్పటి నుంచి నాకు టీ అంటే ఇష్టం. ఆ ఇష్టం నుంచే డ్రాపవుట్ చాయ్‌వాలా ఆలోచన తట్టింది. నా భవిష్యత్ ప్రణాళిక గురించి చెప్పినప్పుడు.. అమ్మానాన్న షాకయ్యారు. అంతదూరం వెళ్లింది.. ఈ మాత్రం దానికేనా అని పెదవి విరిచారు. ఓపికగా నచ్చజెప్పాక దారికొచ్చారు. అనుకున్నట్టే కాఫీ క్యాపిటల్ మెల్బోర్న్లో టీ వ్యాపారం ప్రారంభించాను. ఓ ఎన్ఆర్ఐ నన్ను నమ్మి ఈ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టారు. మా ఆదాయ మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు 5.2 కోట్ల రూపాయల)కు చేరుకుంది. ఇందులో పన్నులు, ఇతర ఖర్చులన్నీ పోగా 20 శాతం లాభం ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేయడం ఆస్ట్రేలియాలో చాలా తేలిక. ఒకప్పుడు ‘నా భవిష్యత్ ఎలా ఉంటుందా’ అని కన్నవాళ్లు ఆందోళన పడేవారు. ఇప్పుడు నా సక్సెస్ స్టోరీ పదిమందికీ చెప్పుకొని మురిసిపోతున్నారు. కొవిడ్ తర్వాత అమ్మ ఆస్ట్రేలియాకు రాలేదు. తన రాక కోసం నేను ఎదురుచూస్తున్నా.
– సంజిత్ కొండా
Read More :
Chris Evans | కమెడియన్ నుంచి కెప్టెన్ అమెరికాగా ఎదిగిన క్రిస్ గురించి ఈ విషయాలు తెలుసా !
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

