Hyderabad Irani Chai | హైదరాబాదీ ప్రైడ్ ఇరానీ చాయ్ తయారీ ఎలాగో లుక్కేయండి
Hyderabad Irani Chai | పరదేశీ పానీయంగా మన దేశానికి వచ్చిన తేనీరు.. స్వదేశంలో అతిథి మర్యాదలో అగ్రతాంబూలం అందుకుంది. ఏకంగా జాతీయ పానీయంగానూ స్థిరపడింది. ఈ పురాణం పక్కన పెడితే.. హైదరాబాదీ ప్రైడ్ ఇరానీ చాయ్ తయారీ ఎలాగో లుక్కేయండి.
Hyderabad Irani Chai | ప్రపంచంలోని సర్వజనులూ సేవించేది ఏమి‘టీ’..? అంటే ఠక్కున వచ్చే సమాధానం ‘టీ’! సూర్యోదయం చిక్కటి టీతో మొదలవుతుంది. ఇలలో ఈవినింగ్ టీ పర్వం కంటపడగానే ఛాయాదేవి పెట్టించే చాయకు వేళయిందని మార్తాండుడు వడివడిగా పడమటి కనుమలో వాలిపోతాడు. కొందరికైతే సుప్రభాత వేళ మాత్రమే కాదు.. పవళింపు సేవకు ముందూ టీ సేవనం తప్పనిసరి. మనిషి జీవితంతో ఇంతలా ముడిపడిన ఈ ఏకాక్షరికి మన పురాణాల్లో చోటు దక్కకపోవడం వాఙ్మయకారుల తప్పిదమే అంటారు చాయ్ ప్రియులు. ఆ పుణ్య పురుషులు ఈ ఉష్ణోదకం రుచి మరిగి ఉంటే క్షీరసాగర మథనం కాస్తా తేనీటి సాగర మథనమయ్యేదని వాళ్ల విశ్వాసం. అంతెందుకు ఆనాడు పూటకూళ్లమ్మో, మధురవాణో, బుచ్చమ్మొదినో.. ఇంత టీ పెట్టిస్తే, ద గ్రేట్ గిరీశం చుట్టపై పద్యం చుట్టేసి.. తేనీటిపై తేటగీతి శతకాన్ని ఆశువుగా వదిలేవాడు అనడంలో కించిత్ సందేహం లేదు. అదీ మరి టీ మహిమ! చైనా గోడ వెనక ఔషధ పానీయాల్లో ఒకటిగా ఉన్న టీ.. 17వ శతాబ్దం నాటికి బ్రిటిష్వాసులకు పరిచయమైందని చరిత్రకారుల అభిప్రాయం. ఆ దరిమిలా బ్రిటిష్ సామ్రాజ్యం విస్తరించిన నేలంతా తేయాకు మొక్కలు వేళ్లూనుకున్నాయి. పరదేశీ పానీయంగా మన దేశానికి వచ్చిన తేనీరు.. స్వదేశంలో అతిథి మర్యాదలో అగ్రతాంబూలం అందుకుంది. ఏకంగా జాతీయ పానీయంగానూ స్థిరపడింది. ఈ పురాణం పక్కన పెడితే.. హైదరాబాదీ ప్రైడ్ ఇరానీ చాయ్ తయారీ ఎలాగో లుక్కేయండి.
ఇరానీ చాయ్
కావాల్సినవి-
నీళ్లు: 400 మి.లీ, టీ పొడి: ఒక టేబుల్ స్పూన్, చక్కెర: రెండు టేబుల్ స్పూన్లు, చిక్కటి పాలు: అర లీటర్
తయారీ: అడుగు మందంగా ఉన్న ఇత్తడి లేదా రాగి గిన్నెను తీసుకోవాలి. అందులో నీళ్లు పోసి, టీ పొడి, చక్కెర వేసి బాగా కలపాలి. డికాక్షన్ మరిగేటప్పుడు ఆవిరి పోకుండా ఉండేందుకు గిన్నెపై సరిపడే ప్లేట్ ఉంచి గోధుమపిండి ముద్దతో రెండిటినీ గట్టిగా ఫిక్స్ చేయాలి (లోపల ఎంత మరిగిందో తెలుసుకునేలా గాజు మూతను పెట్టుకోవచ్చు). ఇప్పుడు గిన్నెను పొయ్యిమీద ఉంచి మీడియం మంట మీద 20 నిమిషాలు మరిగించాలి. ఇంకోవైపు మరో గిన్నెలో పాలను ఉంచి మీడియం మంట మీద మరిగించాలి. మీగడ అంచులకు అంటుకోకుండా మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. పాలు సగం అయ్యే వరకు మరిగించాలి. ఇరవై నిమిషాలయ్యాక డికాక్షన్ను మరో పది నిమిషాలు చిన్నమంటపై మరగనివ్వాలి. మొదట తీసుకున్న నీటిలో డికాక్షన్ పావు వంతు వచ్చిందని అంచనాకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో సగం డికాక్షన్ వేసుకొని, మిగిలిన సగం పాలు కలిపితే.. జిహ్వకు జీవాన్నిచ్చే ఇరానీ చాయ్ సిద్ధం.
‘టీ’కా తాత్పర్యం
చలిగా ఉన్నప్పుడు టీ వెచ్చదనాన్నిస్తుంది. వేడిగా ఉన్నప్పుడు చల్లదనాన్ని ప్రసాదిస్తుంది. కుంగుబాటుకు లోనైనప్పుడు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఉద్రేకానికి గురైనప్పుడు శాంతపరుస్తుంది.
-బ్రిటన్ మాజీ ప్రధాని విలియం ఇవార్ట్ గ్లాడ్‌స్టన్
Read More :
“ఇంజనీరింగ్, ఎంబీఏలు చదివి ఛాయ్ అమ్ముకుంటున్న యూత్.. ఎందుకింత క్రేజ్ !!”
“ఏది బెటర్?… బెల్లం చాయ్ or చక్కెర చాయ్
“పిల్లి, కుక్క, జిరాఫీ .. ఇలా బొమ్మలతో చేసిన టీ కప్లే ఇప్పుడు ఫ్యాషన్”
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
స్కౌట్ అండ్ గైడ్ది నిస్వార్థ సేవ
Krithi Shetty | చూపులతోనే కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి!
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

