పిల్లి, కుక్క, జిరాఫీ .. ఇలా బొమ్మలతో చేసిన టీ కప్లే ఇప్పుడు ఫ్యాషన్
Aesthetic Tea Cups | బొమ్మలాటలో చిన్నచిన్న పింగాణీ టీ సెట్లు చూస్తూనే ఉంటాం. అది పాత విషయమే. నిజమైన టీ సెట్లను బొమ్మల్లా పేర్చడమే కొత్త ట్రెండ్. అవును, మనం సాధారణంగా వాడుకునే పింగాణీ టీ సెట్లను పిల్లిలా, కుందేలులా, జీబ్రాలా, జిరాఫీలా.. ఇలా రకరకాల బొమ్మల్లా అమర్చుకోవచ్చు. వంటింటికి కొత్త అందాన్ని తెచ్చిపెట్టుకోవచ్చు.
Aesthetic Tea Cups | బొమ్మలాటలో చిన్నచిన్న పింగాణీ టీ సెట్లు చూస్తూనే ఉంటాం. అది పాత విషయమే. నిజమైన టీ సెట్లను బొమ్మల్లా పేర్చడమే కొత్త ట్రెండ్. అవును, మనం సాధారణంగా వాడుకునే పింగాణీ టీ సెట్లను పిల్లిలా, కుందేలులా, జీబ్రాలా, జిరాఫీలా.. ఇలా రకరకాల బొమ్మల్లా అమర్చుకోవచ్చు. వంటింటికి కొత్త అందాన్ని తెచ్చిపెట్టుకోవచ్చు.

ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటే ఇల్లు బాగున్నట్టే అనుకునేవారు ఒకప్పుడు. కానీ అందంగానూ పెట్టుకుంటేనే ఇల్లు బాగుంటుందని అనుకుంటున్నారు ఇప్పుడు. ‘ఈస్తటిక్ సెన్స్ ( Aesthetic Sense )‘ పేరిట ఇంటీరియర్ డిజైనింగ్ మొదలు ఇంట్లో వాడే గిన్నెలూ చెంచాల దాకా అన్నీ అందంగా కనిపించాలి, అలంకరించినట్టే అనిపించాలి అంటున్నారు. ఇదే ఇప్పటి ట్రెండ్. ఆ ట్రెండ్‌కు తగ్గట్టే, వంటింటి పాత్రలనూ చూడముచ్చటగా ముస్తాబు చేస్తున్నారు డిజైనర్లు. అలా పుట్టుకొచ్చినవే ఇక్కడ కనిపిస్తున్న టీ సెట్లు. ఈ సెట్లలో కప్పులు, టీ కెటిల్, పంచదార డబ్బా.. అన్నీ కలిసి ఉంటాయి. వాటిని ఒక క్రమంలో పేరిస్తే మనం ఎంచుకున్న దాన్ని బట్టి ఏనుగు, కోతి, కుందేలు, పాపాయి.. ఇలా రకరకాల బొమ్మలు తయారవుతాయన్నమాట.

సెట్టును బట్టి ఒక కప్పు లేదా రెండు కప్పులు ఇందులో ఉంటాయి. దాదాపు అన్నింటిలోనూ ఉండేవి.. పంచదార డబ్బా, టీ కెటిల్. కావాలనుకున్నప్పుడు వీటిని విడదీసి వాడుకోవచ్చు. సాధారణ పింగాణీ పాత్రల్లానే చక్కగా ఉపయోగడతాయి. వాడుకోనప్పుడు డైనింగ్ టేబుల్ మీద అలంకరణకు పెట్టుకోవచ్చు. అమెజాన్‌తో పాటు వివిధ ఆన్లైన్ దుకాణాల్లో ‘యానిమల్ అసెంబుల్ మల్టీ ఫంక్షనల్ టీ పాట్ సెట్’లాంటి పేర్లతో అమ్ముతున్నారు. వీటిని కానుకగా ఇస్తే అందుకున్న వాళ్లు ఆనందంతో పాటు ఆశ్చర్యానికీ గురవుతారు. ఆలస్యమెందుకు, మీరూ ఆర్డర్ పెట్టేయండి మరి!
Read More :
“LED Curtain Lights | కర్టెన్స్‌ను ఇకపై ఇలా మెరిపించండి”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

