హైదరాబాద్ : మనం ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ చూసిన పండుగలను స్వాగతించడానికి, మనం స్వర్గసీమగా భావించే ఇంటికి సరికొత్త హంగులద్దాలని కోరుకునే సీజన్ ఇది. ఓ ఇల్లును అందంగా మార్చడానికి ఎంతో శ్రమిస్తుంటాం. ఫర్నీచర్‌ను సర్దడం , గోడలకు రంగులు వేయడం నుంచి మనసుకు నచ్చిన ఫ్లోరింగ్‌ను ఎంచుకోవడం, మీ ఇంటికి ఉన్న సీలింగ్‌ను అందంగా తీర్చిదిద్దడం వరకూ అన్ని అంశాలూ మీ ఇంటికి సరికొత్త లుక్ తేవడానికి, వాటిని పండుగకు సిద్ధంగా మలచడానికి తోడ్పడతాయి. అయితే, మనలో చాలామంది హోమ్ రెనోవేషన్ ప్రాజెక్ట్‌లను సాధ్యమైనంత వరకూ పెద్దగా ఆసక్తి చూపరు.
ఎందుకంటే అవి అత్యధికంగా సమయం తీసుకోవడంతో పాటు, అసౌకర్యమూ కలిగిస్తాయి. కానీ సరైన ప్రణాళిక, సృజనాత్మక ఇంటీరియర్ డిజైన్ ఆలోచనలతో గృహాలను సమూలంగా మార్చవచ్చు. మీ అవసరాలు, ప్రాధాన్యతలు, బడ్జెట్‌ను అందుకునే రీతిలో ఇంటీరియల్ డిజైన్ ఉండటం అత్యంత కీలకం. కానీ, ఈ ప్రక్రియలో మీ లివింగ్ స్పేస్‌లో అత్యంత కీలకమైన కొన్ని భాగాలను మాత్రం అసలు మరిచిపోకూడదు. అలాంటి ఓ అత్యంత కీలకమైన అంశం సీలింగ్.
చాలా సందర్భాలలో సీలింగ్స్‌ను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏదైనా ఇంటీరియర్ స్పేస్‌ను అలంకరించడం లేదా రేనోవేషన్ చేయాలనుకుంటే సాధారణంగా గోడలు, ఫ్లోర్స్ మీద ఎక్కువగా శ్రద్ధ చూపుతుంటారు. మీ అభిరుచులకు తగినట్లుగా అంశాలను మార్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ, సీలింగ్స్ సైతం మీ ఇంటిలోని వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచడంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఇంటి ఐదో గోడను అందంగా మార్చాలంటే చాలా మంది డిజైనర్ కృత్రిమ సీలింగ్స్‌ను ఎంచుకుంటుంటారు. ఎలాంటి ఇంటీరియర్‌కు అయినా చూపుల పరంగా గణనీయమైన ప్రభావాన్ని అవి చూపుతాయి. ప్రస్తుతం, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు , చివరికి ఆర్కిటెక్ట్‌లు డిజైన్ ప్రక్రియ ప్రారంభం నుంచి డిజైన్డ్ ఫాల్స్ సీలింగ్స్ వినియోగాన్ని నొక్కి చెబుతున్నారు.
ఓ ఇంటి యజమానిగా, గణనీయంగా మీ ఇంటీరియర్స్‌కు రేనోవేషన్ చేయడమన్నది అత్యంత ఖర్చుతో కూడిన అంశంగా కనిపించవచ్చు.
అయితే, పని పూర్తిచేయడానికి, మీ ఇంటి సీలింగ్ పునః రూపకల్పన చేయడానికి మీ బ్యాంక్‌లో నిల్వ చేసిన నగదును మొత్తం ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. మీ పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో నమ్మకమైన భాగస్వామి అవసరం ఉంది. సెయింట్ గోబైన్ జిప్రోక్ దీని కోసం బడ్జెట్ – గడువు తేదీలను అందుకునే రీతిలో సమగ్రమైన క్యాటలాగ్స్‌ను అభివృద్ధి చేసింది. కేవలం ఏడు రోజులలో మీ సీలింగ్‌కు నూతన అందాన్ని ఇవి అందించనున్నాయి. జిప్సం సీలింగ్ ఖర్చు కేవలం ఒక అంశం మీద మాత్రమే కాదు నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
అవి, డిజైన్ అవకాశాలు, ఇన్స్టాలేషన్ ఖర్చు,రవాణా,కూలీ ఖర్చులు. ఈ అంశాలన్నీ గుణించిన తరువాత, ఈ ఖర్చు సాధారణంగా చదరపు అడుగుకు 60–100 రూపాయల మధ్య ఉంటుందని భావించవచ్చు. అయితే, ఇదంతా కూడా మీరు సంప్రదించిన ఇంటీరియర్ డిజైనర్ల పై ఆధారపడి ఉంటుంది. మీ లివింగ్ స్పేస్‌కు సంబంధించి అత్యుత్తమ డిజైన్ ఎంచుకునేందుకు తగిన మార్గనిర్దేశకత్వం కూడా జిప్రోక్ మీకు చేస్తుంది. ఇదంతా కూడా సహేతుకమైన, అందుబాటు ధరలలోనే అందిస్తుంది. ఈ ఫలితంగానే, సీలింగ్స్ దగ్గరకు వచ్చేసరికి మీకు అత్యంత నమ్మకమైన మిత్రునిగా జిప్రోక్ నిలుస్తుంది.
జిప్సం బోర్డులను వినియోగించి సీలింగ్స్ డిజైనింగ్ దగ్గరకు వచ్చేసరికి, మీకు ఎంచుకునేందుకు ఎన్నో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. మీ సీలింగ్స్ కోసం విభిన్న ఆకృతులతో మీరు ప్రయోగాలు చేయడం మాత్రమే కాదు, మీ లివింగ్ స్పేస్‌కు ఆహ్లాదవాతావరణాన్ని జోడించవచ్చు. ఆకర్షణీయమైన ఫినీష్‌ను అందించడం ద్వారా మీ ప్రోపర్టీ అందం ఇది మెరుగుపరుస్తుంది. డిజైనర్ సీలింగ్స్‌తో సౌందర్యం మెరుగుపడటమే కాదు, పలు ప్రయోజనాలు సైతం ఇవి అందిస్తాయి. మీరు ఎయిర్ కండీషనర్ వినియోగించే అవసరాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా వేసవిలో విద్యుత్‌బిల్లులను సైతం తగ్గిస్తాయి.
మీ ఏసీ ఆ ప్రాంతాన్ని కూడా చల్లబరచవలసి వస్తుంది. ఈ వ్యాపారంలో సుప్రసిద్ధమైనది జిప్రోక్. ఇది వాల్ డెకార్, ఫాల్స్ సీలింగ్స్‌కోసం విస్తృతశ్రేణిలో అవకాశాలను అందిస్తుంది. ఈ ఫాల్స్ సీలింగ్స్ అతి తేలికగా ఉండటంతో పాటు, మన్నికైన మెటీరియల్స్ అయిన జిప్సం లాంటి వాటితో తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇవి కనీసం రెండు దశాబ్దాల పాటు సాధారణ వినియోగానికి అనుకూలంగా ఉండటంతో పాటు, సులభంగా ఇన్స్టాల్ చేసుకోవడమూ ఈజీ అంతే కాకుండా వెరైటీ డిజైన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.