Health Tips | రోజూ నాలుగు కప్పుల టీతో తగ్గనున్న మధుమేహ ముప్పు
రోజులో కొన్ని సార్లు టీ తాగడం వల్ల టైప్ టూ డయాబెటిస్ తగ్గముఖం పడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది.
న్యూఢిల్లీ : రోజులో పలుమార్లు టీ తాగడం వల్ల టైప్ టూ డయాబెటిస్ తగ్గముఖం పడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. నిత్యం టీ సేవించడంతో మధుమేహాన్ని నియంత్రించడంతో పాటు దాని లక్షణాలనూ తగ్గిస్తుందని ఈ అధ్యయనం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 42.2 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు.
రోజుకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల టీ తాగడం ద్వారా మధుమేహ ముప్పు గణనీయంగా తగ్గినట్టు ఎనిమిది దేశాల్లో నిర్వహించిన 19 అధ్యయనాల్లో వెల్లడైంది. టైప్ 2 డయాబెటిస్‌పై బ్లాక్, గ్రీన్ టీ వినియోగం ప్రభావాన్ని ఈ అధ్యయనం అంచనా వేసింది. రోజూ టీ తాగడం ఆరోగ్యానికి హానికరం కాదని, పైగా డయాబెటిస్ ముప్పును ఇది తగ్గిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ సెంటర్ ఫర్ డయాబెటిస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కసిఫ్ ఎం. మునిర్ పేర్కొన్నారు.
పాలీపెనాల్స్ అధికంగా ఉన్న ఆహారంలో కూడా ఇవే ప్రభావాలు కనిపించాయని స్టాక్‌హోంలో జరిగిన యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్‌లో ఈ అధ్యయన వివరాలను సమర్పించారు. ఇక రోజూ టీ తాగడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఛాయ్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే..
మెరుగైన జీర్ణశక్తి
మానసిక ఆరోగ్యం మెరుగుదల
బరువు తగ్గడం
ఒత్తిడి మటుమాయం
శారీరక ఉత్తేజం
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Diabetes
- Health news
- tea
RELATED ARTICLES
తాజా వార్తలు
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
7వేల మంది అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

