Tea | టీ చేసిన నేరమేంటీ?
Peach Oolong Tea | ఒక్కసారైనా కొలెస్ట్రాల్‌ను కరిగించే గ్రీన్ టీతో రంగంలోకి దిగిన దాఖలాల్లేవు!! అదే సమయంలో విలన్‌గారి క్రూరత్వాన్ని విస్తృతంగా చూపించడానికి టీని వాడుకోవడం గర్హనీయం.
Tea | జాతీయ పానీయంబైన తేనీటికి సర్వత్రా ఆదరణ ఉంది. కానీ, సినిమాల్లో మాత్రం దీనిని విలువైన ప్రాపర్టీగా వాడుకోలేదన్నది నిర్వివాదాంశం. ‘ధూమపానం క్యాన్సర్ కారకం, ప్రాణాంతకం. మద్యపానం ప్రమాదకరం’ అని హెచ్చరిస్తూనే.. సినీ సన్నివేశాల్లో వాటికి అగ్రతాంబూలం ఇవ్వడం శోచనీయం. పోనీ ఒకటీ అరా సీన్లలో టీ కప్పులు కనిపించినా, వాటిని అందుకున్న పాత్ర.. ఒక్క సిప్ తాగితే ఎక్కువ! పైగా బుడ్డీమంతులను హీరోలుగా చూపించడం వెండితెర రివాజు.
చాలా చిత్రాల్లో రింగులు రింగులుగా పొగ ఊదేస్తూ హీరోగారు ఎంట్రీ ఇస్తుంటాడు! కానీ, ఒక్కసారైనా కొలెస్ట్రాల్‌ను కరిగించే గ్రీన్ టీతో రంగంలోకి దిగిన దాఖలాల్లేవు!! అదే సమయంలో విలన్‌గారి క్రూరత్వాన్ని విస్తృతంగా చూపించడానికి టీని వాడుకోవడం గర్హనీయం. ఉష్ణోదక గిలాసను గిరాటు కొట్టి విలనీ విరాట్రూపం చూపించడం చాలా సినిమాల్లో కనిపించిందే! యుగళ గీతాల చిత్రీకరణలో పోటాపోటీగా ఊటీకి వెళ్లి అక్కడి తేయాకు తోటల్ని విరివిగా వాడుకున్న సినీజనం.. మిగతా సన్నివేశాల్లో ఏకాక్షరిని లేశమాత్రంగా చూపించడం విడ్డూరం. ఇంతకూ టీ చేసిన నేరమేంటీ? అంటే చెప్పరు! వెండితెరపై దశాబ్దాలుగా అణచివేతకు గురైన చాయ్‌పై ‘మృగరాజు’ సినిమాలో ‘ఏయ్ చాయ్ చటుక్కునా తాగరా భాయ్’ అంటూ చిరంజీవి ఓ పాట స్వయంగా తానే పాడి, ఆడటం టీ ప్రేమికులకు కాస్త ఊరట! ఈ ముచ్చట పక్కన పెట్టి బరువును తగ్గించే పీచ్ ఉలాంగ్ టీ తయారీ గురించి తెలుసుకోండి.
పీచ్ ఉలాంగ్ టీ
కావలసినవి: గ్రీన్ టీ లీవ్స్: ఒక టీ స్పూన్, నీళ్లు: 200 మి.లీ., తేనె: ఒక టేబుల్ స్పూన్
తయారీ: ముందుగా ఒక ప్రాతలో నీటిని తీసుకొని పొయ్యిమీద సన్నని మంటపై బాగా మరిగించాలి. మరో పాత్రలో గ్రీన్ టీ లీవ్స్ వేసుకొని.. అందులో మసులుతున్న నీటిని పోసి రెండు నిమిషాలు మూత పెట్టేయాలి. గ్లాస్లో తేనె వేసుకొని తేనీటిని అందులో పోసుకొని బాగా కలుపుకొంటే.. పీచ్ ఉలాంగ్ టీ సిద్ధం. ఇది జీవక్రియలను క్రమబద్ధీకరిస్తుంది. కోల్ట్ టీగానూ దీన్ని సేవించవచ్చు.
‘టీ’కా తాత్పర్యం
ప్రతి టీ ఒక ఊహాత్మకమైన ప్రయాణానికి నాంది పలుకుతుంది.
– ఆంగ్ల రచయిత్రి కేథరిన్ డాంజల్
Read More :
“Green Tea | జుట్టు ఎక్కువగా రాలిపోతున్నప్పుడు గ్రీన్ టీ తాగొచ్చా?”
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

