Green Tea | జుట్టు ఎక్కువగా రాలిపోతున్నప్పుడు గ్రీన్ టీ తాగొచ్చా?
Green Tea Benefits | తలనొప్పి నివారణకు అల్లం టీ! నిద్రమబ్బు వదలడానికి ఇలాచీ టీ!! బరువు తగ్గడానికి గ్రీన్ టీ.. అదొక్కటేనా..! చర్మ సంరక్షణకు... జుట్టు సత్తువకూ అదే గ్రీన్ టీ..! మరెన్నో ప్రయోజనాలకు గ్రీన్ టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది.అవేంటో తెలుసుకుందాం..
Green Tea Benefits | తలనొప్పి నివారణకు అల్లం టీ! నిద్రమబ్బు వదలడానికి ఇలాచీ టీ!! బరువు తగ్గడానికి గ్రీన్ టీ.. అదొక్కటేనా..! చర్మ సంరక్షణకు… జుట్టు సత్తువకూ అదే గ్రీన్ టీ..! మరెన్నో ప్రయోజనాలకు గ్రీన్ టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది.అవేంటో తెలుసుకుందాం..
ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాలను మెరుగుపరిచే బయోయాక్టివ్ సమ్మేళనాలు గ్రీన్ టీలో పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ టీలో ఉండే ‘ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్’ అనే సమ్మేళనం అత్యంత శక్తిమంతమైనది. ఇది అనేక వ్యాధులను అరికడుతుంది. ఇందులోని ఫ్లవనోల్స్, కాటెచిన్స్ జీవక్రియ రేటును మెరుగుపరుస్తాయి. శరీర బరువును నియంత్రించడంతోపాటు ఇన్ఫ్లమేటరీ గుణాలతో పోరాడటంలో గ్రీన్ టీ చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. కప్పు గ్రీన్ టీతో అనేక రకాల అమైనో ఆమ్లాలు, ఎంజైమ్‌లు, కార్బొహైడ్రేట్లు శరీరానికి అందుతాయి. తేయాకులోని మెగ్నిషియం, క్యాల్షియం, మాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ వంటి ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

చర్మ సంరక్షణలో..
చర్మాన్ని తేమగా ఉంచడంలో గ్రీన్ టీ సహాయకారిగా పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి. ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గించేందుకు వంద గ్రాముల గ్రీన్ టీ ఆకులను అరలీటరు నీటిలో కలిపి 40 నిమిషాలపాటు చిన్నమంటపై మరిగించుకోవాలి. వడగట్టి గ్రీన్ టీ ముద్దను ముఖానికి మర్దన చేసుకోవాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి ఒకటి, రెండుసార్లు చేస్తే మొటిమలు, మచ్చలు మాయం అవుతాయి. గ్రీన్ టీని స్కిన్ టోనర్‌కు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. టీ స్పూన్ గ్రీన్ టీ పొడిలో మూడు స్పూన్ల పెరుగు కలిపి ముఖానికి బాగా పట్టించాలి. పది నిమిషాల తర్వాత చన్నీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మకాంతి రెట్టింపు అవుతుంది. ముఖంపై ముడతలు తగ్గించేందుకు, కమిలిన చర్మం నిగారించేందుకు, పొడిబారిన చర్మానికి జీవకళ సంతరించేందుకు గ్రీన్ టీ ఉత్పత్తులు అనేకం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
కేశాలకు ఎంతో మేలు
గ్రీన్ టీ జుట్టు సంరక్షణలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. జుట్టు రాలడానికి కారణమయ్యే డైహైడ్రో టెస్టోస్టెరాన్ పెరుగుదలను గ్రీన్ టీ నిరోధిస్తుంది. దీనిలోని క్రిమినాశక లక్షణాలు చుండ్రు, సోరియాసిస్ వంటి జుట్టు సమస్యలను అరికడతాయి. గ్రీన్ టీ రోజుకోపూట తాగితే జుట్టురాలడం నియంత్రణలోకి వస్తుంది. ఇందులోని ఫాలిఫెనాల్స్, మిటమిన్-ఇ, సి కేశాల పోషణకు సహకరిస్తాయి. మూడు గ్రీన్ టీ బ్యాగులను అరలీటరు నీటిలో బాగా మరిగించి చల్లార్చుకోవాలి. జుట్టుకు షాంపూ, కండిషనర్ చేసిన తర్వాత గ్రీన్ టీ నీటితో శుభ్రం చేసుకుంటే కుదుళ్లకు సత్తువ వస్తుంది. కేశ సంరక్షణ కోసం గ్రీన్ టీతో చేసిన అనేక ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. నిపుణుల సలహా మేరకు వాటిని ప్రయత్నించవచ్చు.
మరిన్ని.. ప్రయోజనాలు
> గ్రీన్ టీలో కెఫీన్ తక్కువ. ఇది మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్ అయిన అడెనోసిన్ చర్యలను అడ్డుకుంటుంది. కెఫీన్లేని కారణంగా మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎల్-థియనిన్ అనే అమైనో ఆమ్లం మెదడుకు పదునుపెడుతుంది.
> గ్రీన్ టీలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దంత సమస్యలను, నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. నోటిలో హానికారక బ్యాక్టీరియాను చంపి, దుర్వాసన సమస్యను తగ్గిస్తాయి.
> మధుమేహ బాధితులకు గ్రీన్ టీ మేలు చేస్తుంది. ఇందులోని పాలిఫెనాల్స్ శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
> నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం గ్రీన్ టీ క్యాన్సర్ కారక కణాలతో పోరాడుతుందని తేలింది. తగిన మోతాదులో గ్రీన్ టీ తీసుకునే వారిలో ఊపిరితిత్తులు, చర్మం, రొమ్ము, కాలేయం, పెద్దపేగు, క్లోమ క్యాన్సర్లు అరుదని పలు అధ్యయనాల్లో తేలింది.
> ఆర్థరైటిస్‌కు కారణమయ్యే కొన్ని అణువుల ఉత్పత్తిని గ్రీన్ టీ తగ్గిస్తుంది. ఎముకలు, మృదులాస్థి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఎముకల పరిపుష్టికి గ్రీన్ టీ దోహదం చేస్తుంది.
> చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెకు మేలు చేస్తుంది. మతిమరుపును పారదోలే ఔషధంగా గ్రీన్ టీకి పేరు. అందుకే ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రీన్ టీ తీసుకుంటే ఆశించిన ప్రయోజనాలు పొందొచ్చు.
Read More :
Black Carrot | బ్లాక్ క్యారెట్.. వీటితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

