ఈ అనారోగ్యాలు దరి చేరొద్దంటే.. మీ డైట్లో బీట్రూట్ ఉండాల్సిందే
Health tips | రక్తహీనత సమస్య చాలామందిలో ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని రకాల పండ్లు, కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా
రక్తహీనత సమస్య చాలామందిలో ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని రకాల పండ్లు, కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా బీట్రూట్ను డైట్లో భాగం చేసుకోవాలి. బీట్రూట్ను రెగ్యులర్‌గా తినడంవల్ల రక్తం వృద్ధి చెందుతుంది. శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. చెడు కొలెస్టరాల్‌ను తగ్గించడంలో, హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో బీట్రూట్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతేగాక బీట్రూట్తో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..
బీట్రూట్తో ప్రయోజనాలు..
1. బీట్రూట్లో బీటాలైన్స్ అనే ఫైటోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాల కారణంగా కడుపులోని దీర్ఘకాలిక మంట నివారించబడుతుంది. బీట్రూట్ తీసుకోవడంవల్ల కీళ్లలో నొప్పి కూడా తగ్గుతుంది.
2. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు బీట్రూట్ జ్యూస్‌లో గ్లూటామైన్, అమైనో ఆమ్లాలు, 3.4 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది మలబద్దకం, పేగు వ్యాధులు, పెద్దపేగు క్యాన్సర్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. జీవక్రియలను మెరుగుపరుస్తుంది. కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువసేపు ఎనర్జీగా ఉంచుతుంది.
3. బీట్రూట్లో ఉండే నైట్రేట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి రక్త నాళాలను ముడుచుకోకుండా చేయడానికి, మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతాయి. తద్వారా మెదడు పనితీరు వృద్ధి చెందుతుంది.
4. అదేవిధంగా బీట్రూట్లలో ఉండే డైటరీ నైట్రేట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో, గుండెపోటు నుంచి రక్షించడంలో తోడ్పడుతుంది.
5. బీట్రూట్లు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని సులభతరం చేస్తాయి. అంతేకాక అసాధారణ కణాల పెరుగుదలను, కణితి కణాల విభజనను తగ్గిస్తాయి. బీట్రూట్లలో ఉండే విటమిన్ బి6, సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ప్రొటీన్, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన పోషకాల కోసం రోజూవారి డైట్లో బీట్రూట్ ఉండేలా చూసుకోవాల్సిందే.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

