Black Carrot | బ్లాక్ క్యారెట్.. వీటితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
నల్ల క్యారెట్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆంథోసైనిన్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాన్సర్లను అరికడుతుంది. కంటికి చాలా మంచిది.
Black Carrot | క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆందం కూడా పొందతాం. క్యారెట్లో 88 శాతం నీరుతో పాటు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ డైటరీ ఫైబర్, అతి తక్కువగా కొవ్వులు ఉంటాయి. డైటర్ ఫైబర్‌లో సెల్యులోజ్ అధికంగా ఉంటుంది. విటమిన్ కే, విటమిన్ బీ6 లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే బీటా కెరోటిన్ ఏ విటమిన్ లోపంతో బాధపడే వారికి సహకరిస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతుంది. దీనిలోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇది డయాబెటిస్ పేషెంట్లకు దివ్వౌషధంగా పనిచేస్తుంది.
మనకు తెలిసి క్యారెట్ అనగానే ఎర్రటి కూరగాయ గుర్తుకొస్తుంది. అయితే, దీనిలో ఎన్నో రంగులు ఉన్నాయి. ఎరుపు రంగుతోపాటు పసుపు, ఆరెంజ్, బ్లాక్ క్యారెట్లు కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. బ్లాక్ క్యారెట్లు మిగిలిన వాటి కంటే కలర్ఫుల్గా ఉండకపోవచ్చు. కానీ దాని ప్రయోజనాలు అందంగా కనిపించే క్యారెట్ కంటే చాలా ఎక్కువే ఉంటాయని సెలవిస్తున్నారు పోషకాహార నిపుణులు.
బ్లాక్ క్యారెట్లలో పీచు, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సీ, మాంగనీస్, విటమిన్ బీ వంటి పోషకాలు లభిస్తాయి. బ్లాక్ క్యారెట్లో లభించే పోషకాలు ఇతర క్యారెట్ల కంటే చాలా ఎక్కువ. బ్లాక్ క్యారెట్ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, అయినప్పటికీ దీనిని శీతాకాలంలో కూడా తినవచ్చు. ఇందులో విటమిన్ సీ, కే, బీ1, బీ2, బీ3, బీ6, ఈ ఉండి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. బ్లాక్ క్యారెట్లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ఫైబర్ శరీరంలో కొవ్వు పెరగకుండా కాపాడుతుంది. దీని కారణంగా నల్ల క్యారెట్ కూడా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే ఐరన్ కంటి చూపును పెంచుతుంది.
బ్లాక్ క్యారెట్లలో ఉండే ఆంథోసైనిన్ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ క్యారెట్లు రక్తంలోని మలినాలు తొలగించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో రక్త పరిమాణాన్ని పెంచుతుంది. దీనిలోని సీ విటమిన్ తెల్ల రక్త కణాలను పెంచడంలో సాయపడుతుంది. వీటిలో లభించే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దకం, గ్యాస్, ఉబ్బరం, గుండెలో మంట, విరేచనాలు వంటి సమస్యలను ఇది దూరం చేస్తుంది. బ్యాక్ క్యారెట్లను తరచుగా తినడం వల్ల ఆల్జీమర్స్ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీఆక్సిడెంట్లు రుమాటియిడ్ ఆర్థరైటీస్ చికిత్సలో ఎంతో ఉపయోగపడతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

