Kiwi fruit | కివీ ఫ్రూట్స్ ఇన్ని రంగుల్లో దొరుకుతాయా? ఏ కలర్ పండు తింటే ఆరోగ్యానికి మంచిది
Kiwi fruit | ‘సపోటాలా కనిపిస్తుంది. గుడ్డును తలపిస్తుంది. తొలుత పులుపు. తర్వాత తీపి. ఏమిటది?’ - ఆ మాధుర్యం తెలిసిన ఎవరైనా చటుక్కున కివీ అనే చెప్పేస్తారు. నూనూగు చెక్కుతో, ఆకుపచ్చ గుజ్జుతో.. పుల్లపుల్లగా తియ్యతియ్యగా కరిగిపోయే కివీని ‘వండర్ ఫ్రూట్' అనీ పిలుస్తారు.
Kiwi fruit | ‘సపోటాలా కనిపిస్తుంది. గుడ్డును తలపిస్తుంది. తొలుత పులుపు. తర్వాత తీపి. ఏమిటది?’ – ఆ మాధుర్యం తెలిసిన ఎవరైనా చటుక్కున కివీ అనే చెప్పేస్తారు. నూనూగు చెక్కుతో, ఆకుపచ్చ గుజ్జుతో.. పుల్లపుల్లగా తియ్యతియ్యగా కరిగిపోయే కివీని ‘ వండర్ ఫ్రూట్ ( Wonder fruit )’ అనీ పిలుస్తారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కివీలో ఆకుపచ్చ రంగే కాదు ఎరుపు, పసుపు లాంటి వర్ణాలూ ఉన్నాయి.

కివీ భారతీయ ఫలం కాదు. చైనాలో మూలాలున్నాయి. కానీ ఇక్కడి ప్రజలు అక్కున చేర్చుకున్నారు. నారింజతో పోలిస్తే ఈ ఫలంలో రెండురెట్లు విటమిన్-సి దొరుకుతుంది. దాదాపు 700 సంవత్సరాల నిండైన చరిత్ర ఉన్న పండిది. న్యూజిలాండ్ ప్రజలు ‘చైనీస్ గూస్బెర్రీ’గా పేరు మార్చారు. కివీ పక్షిని పోలి ఉండటంతో అమెరికన్లు ‘కివీ ఫ్రూట్’గా నిర్ధారణ చేశారు.

ఎర్రగా పచ్చగా…
మనకు ఆకుపచ్చ రంగు గుజ్జుతో ఉండే కివీ మాత్రమే పరిచయం. కానీ ఇందులో చాలా రకాలున్నాయి. అందులోనూ ఓ ఐదు బాగా ప్రజాదరణ పొందాయి. వాటిలో మనం తినేది ఫజ్జీ రకం. ఇందులోనూ హేవార్డ్, బ్రూటో, మేల్లాంటి ఎన్నో వెరైటీలున్నాయి. అయితే, హేవార్డ్ రకం మార్కెట్లో ఎక్కువగా దొరుకుతున్నది. ఇక ముదురు పసుపు పచ్చ రంగులో మృదువైన గుజ్జుతో నోరూరించేది జిన్ గోల్డ్. కొంచెం అటూఇటుగా ఇదే రంగులోని మరో వెరైటీ గోల్డెన్. ఇవి మనం తినే ఫజ్జీ రకం కంటే తియ్యగా ఉంటాయి. అంతేకాదు మామిడి పండు సువాసననూ కలిగి ఉంటాయి. చెక్కు సైతం నునుపుగా ఉంటుంది. ఇక రెడ్ రకంలో నిండు ఎరుపు రంగు గుజ్జు ఉండే పండ్లతో పాటు ఆకుపచ్చ గుజ్జులో గింజల భాగం ఎర్రగా ఉండేవీ, పసుపు గుజ్జులో ఎరుపు గింజలవీ ఉంటాయి. ఇక హార్డీ కోవకు చెందినవి ఎరుపూ, ఆకుపచ్చ రంగు మిశ్రమంగా ఉండే చెక్కులతో రేగు పండు అంత సైజులో ఉంటాయి. వీటిని రేగుపండ్లలాగే కడిగి నేరుగా తినేయొచ్చు.

పోషకాలెన్నో
వంద గ్రాముల కివీ పండులో రోజుకు శరీరానికి కావలసిన దాంట్లో 12 శాతం పీచు లభిస్తుంది. ఇందులోని విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కివీ పండ్లలో అధిక మోతాదులో దొరికే ల్యూటిన్, జెక్సాంథిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ పండుకు రక్తాన్ని పల్చగా చేసే స్వభావమూ ఉంది. తద్వారా గుండె సామర్థ్యం పెరుగుతుంది. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇనోసిటాల్ అని పిలిచే చక్కెరలు డిప్రెషన్‌కు మందులా పనిచేస్తాయి. కివీల్లో దొరికే అర్జినిన్ అనే అమైనో యాసిడ్ పురుషుల్లో వంధ్యత్వాన్ని తగ్గించడానికి సహకరిస్తుంది. విటమిన్-ఇ చర్మానికి మెరుపును ఇస్తుంది. ఇన్ని సుగుణాలున్న ఈ పండును ‘వండర్ ఫ్రూట్’ అని పిలవడంలో తప్పేం లేదు కదూ!

Read More :
“Sweet Corn | స్వీట్ కార్న్‌తో స్వీట్ హెల్త్.. ఎలాగో తెలుసా..?”
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Health
- Health benefits
- kiwi
RELATED ARTICLES
తాజా వార్తలు
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

