Banana | డైటింగ్ చేస్తుంటే అరటి పండు తినొచ్చా? లేదా?
Banana Health Benefits | అరటిపండు తింటే బరువు పెరుగుతారనీ, డైటింగ్‌లో ఉన్న వాళ్లయితే.. ముట్టుకున్నా మహాపాపమనీ.. అంటారు.
Banana Health Benefits | అరటిపండు తింటే బరువు పెరుగుతారనీ, డైటింగ్‌లో ఉన్న వాళ్లయితే.. ముట్టుకున్నా మహాపాపమనీ.. అంటారు. కానీ ఈ ప్రచారం నిజం కాదు. ఎందుకంటే, అరటిలో కొవ్వులు శూన్యం. 100 కేలరీలు మాత్రమే ఉంటాయి. అరటిపండు తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది.
అరటిలో రెసిస్టెన్స్ స్టార్చ్ (ఆర్ఎస్)గా పిలిచే ఒక రకం పీచులు ఉంటాయి. ఇవి ఇట్టే పొట్ట నిండేలా చేస్తాయి. చాలాసేపు ఆకలివేయకుండా చూస్తాయి. ఇందులోని ఫైబర్స్ మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. అలాగే ఇది సహజ యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. గుండె మంటను తగ్గిస్తుంది. చిటికెడు ఉప్పుతో కలిపి తీసుకోవడం వల్ల పొట్టలో ఇన్ఫెక్షన్లకు
విరుగుడుగా పనిచేస్తుంది.
అరటి మంచి మూడ్ బూస్టర్ కూడా. ఇందులో ఉన్న ట్రిప్టోఫాన్లుగా పిలిచే అమైనో ఆమ్లాలు తర్వాత సెరటోనిన్‌గా మారతాయి. ఇవి మానసిక సంతోషానికి తోడ్పడతాయి.
ఇందులో అధిక మోతాదులో ఉండే మెగ్నీషియం, పొటాషియం లాంటివి గాఢనిద్రకు ఉపకరిస్తాయి. నిద్రాదేవి కొలువైన మెలటోనిన్ హార్మోన్ విడుదలకు సాయపడతాయి.
అరటిలో ఉండే పైరిడాక్సిన్ ఆస్తమాను నియంత్రిస్తుంది. అంతేకాదు, ఈ ఫలం రక్తపోటును అదుపులో ఉంచి.. నరాలను, ఎముకలను శక్తిమంతం చేయగలదు. కాబట్టి, అరటిపండ్లు నిర్భయంగా తినవచ్చు. కానీ, అతి సర్వత్ర వర్జయేత్.. సూత్రం ఎక్కడైనా వర్తించేదే.
Read More :
“రోజుకు ఎన్ని అరటిపండ్లు తినొచ్చు.. అతిగా తింటే వచ్చే సమస్యలు ఏంటి?”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

