సాధారణ అరటి పండ్లతో పోలిస్తే ఎర్రటి అరటి పండ్లు మంచివా? కాదా?
Red Banana Health Benefits | పసుపు, ఆకుపచ్చ అరటిపండ్లలో కన్నా ఎర్రటి అరటిపండ్లలోనే పోషకాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. సాధారణ అరటిపండ్లతో పోలిస్తే కెరోటినాయిడ్లు, విటమిన్-సి ఇందులో అధికం. సహజసిద్ధ యాంటీ ఆక్సిడెంట్లు అయిన గ్యాలోక్యాటకిన్, గ్యాలేట్, డోపమైన్, ఎల్-డోప, క్యాటకోలమిన్స్ లాంటివి ఇందులో పుష్కలం.
› ఒక అధ్యయనం ప్రకారం ఎరుపు రంగు అరటిపండ్లలో ప్రతి గ్రాముకు 54 మైక్రో గ్రాముల డోపమైన్ ఉంటుంది. ఇది నరాలకు ప్రేరణను, మనసుకు ఉత్తేజాన్ని కలిగించే ఒక కర్బన రసాయనిక పదార్థం. భావోద్వేగాలను అదుపులో ఉంచేందుకూ సహకరిస్తుంది. మెదడుతో ముడిపడిన పార్కిన్సన్స్లాంటి వ్యాధులను దరిచేరనీయదు.
› కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఎర్ర అరటిలోని పొటాషియం తోడ్పడుతుంది.
› కొలెస్ట్రాల్ తరహాలో ఉండే ఫైటోస్టెరాల్ అనే సేంద్రియ సమ్మేళనం ఈ రకం అరటిపండ్లలో అధికంగా ఉంటుంది. ఇది రకరకాల వృక్ష సంబంధ పదార్థాల్లో దొరుకుతుంది. ఈ ఫైటోస్టెరాల్ జీర్ణవ్యవస్థలో శోషించుకుపోయి.. పొట్టలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. తద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలుచేస్తుంది.
Read More :
అరటి పండుతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా పెరుగుతుందా?
Health Tips | అరటి పండుతో ఐదు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!
అరటిపండు తింటే బరువు తగ్గుతారా?..పెరుగుతారా?
Banana jewellery | బంగారు నగలు కాదు.. అరటితో చేసిన ఆభరణాల గురించి తెలుసా
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

