అరటిపండు తింటే బరువు తగ్గుతారా?..పెరుగుతారా?
అరటిపండు.. చిన్నపిల్లలనుంచి మొదలుకొని వృద్ధులవరకూ అందరూ ఇష్టంగా తినే పండు. మార్కెట్లో అతితక్కువ ధరకు లభించే పండుకూడా ఇదే. ఇందులో పొటాషియం, పీచు, ఆరోగ్యకర కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అందుకే ప్రతిఒక్కరూ రోజులో రెండు లేదా మూడు అరటిపండ్లు తినాలని వైద్యులు సూచిస్తారు.
అరటిపండు.. చిన్నపిల్లలనుంచి మొదలుకొని వృద్ధులవరకూ అందరూ ఇష్టంగా తినే పండు. మార్కెట్లో అతితక్కువ ధరకు లభించే పండుకూడా ఇదే. ఇందులో పొటాషియం, పీచు, ఆరోగ్యకర కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అందుకే ప్రతిఒక్కరూ రోజులో రెండు లేదా మూడు అరటిపండ్లు తినాలని వైద్యులు సూచిస్తారు.
అయితే, ఎక్కువ మొత్తంలో తింటామంటే కుదరదు. మిగతా ఆహారం తినలేక పోషకాహారలోపంతో బాధపడుతారు. అందుకే రోజుకు మూడు మించకుండా తింటే అరటిపండ్లతో ఐదురకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు తగ్గేందుకు ఈ అరటి పండ్లు ఉపయోగపడుతాయని తెలిపారు. అరటిపండ్లు తింటే బరువు పెరుగుతారనేది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు.
అరటిపండుతో ఐదు ప్రయోజనాలు..
1.బరువు తగ్గొచ్చు..
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ అరటిపండును తినొచ్చు. ఒక్క అరటిపండులో 100 కేలరీల శక్తి ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అరటిపండు తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. కేలరీలు ఎక్కువగా తీసుకునే ప్రమాదం ఉండదు. దీంతో ఈజీగా బరువు తగ్గొచ్చు.
2. శక్తిస్థాయిని పెంచుతుంది..
అరటిపండ్లు శక్తి స్థాయిలను పెంచడంలో, రోజంతా అలసటను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎనర్జీ డ్రింక్స్ కంటే అరటిపండ్లు ఆరోగ్యకరమైన శక్తిని ఇస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే రోజుకు రెండు అరటిపండ్లు తింటే మనం రోజువారీ కార్యకలాపాలు చేసుకునేందుకు కావాల్సిన శక్తి వస్తుంది.
3. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..
అరటిపండులో మాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. రోజూ అరటిపండ్లను తినడం వల్ల చర్మంపై ముడతలు, మొటిమలు, పొడి చర్మంలాంటి చర్మ సమస్యలను అధిగమించవచ్చు.
4. గుండెకు మెరుగైన రక్షణ
అరటిపండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండెకు మెరుగైన రక్షణను ఇస్తుంది. బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. ఓ అధ్యయనం ప్రకారం.. రోజుకొక అరటిపండు తింటే గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం 27శాతం తగ్గిపోతుంది.
5. కంటిచూపును పెంచుతుంది..
ప్రతిరోజూ అరటిపండ్లు తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం..అరటిపండ్లలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
KBR Park | ఎక్కడి స్తంభాలు అక్కడే.. పనులు ఆగిన కేబీఆర్ పార్క్ వద్ద అధ్వాన స్థితి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. దక్షి, షాలినిని కావాలనే ఎలిమినేట్ చేశారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

