Health Tips | పూర్తిగా మగ్గని అరటి పండును రోజూ తింటే క్యాన్సర్కు చెక్!
ఫైబర్ అధికంగా ఉండే సమతులాహారాన్ని తీసుకుంటే ముందుముందు తీవ్ర అనారోగ్యాల బారినపడకుండా ఉండవచ్చని మరోసారి వెల్లడైంది.
న్యూఢిల్లీ : ఫైబర్ అధికంగా ఉండే సమతులాహారాన్ని తీసుకుంటే ముందుముందు తీవ్ర అనారోగ్యాల బారినపడకుండా ఉండవచ్చని మరోసారి వెల్లడైంది. ముఖ్యంగా జీర్ణకోశ క్యాన్సర్ల ముప్పును నివారించేందుకు ప్రాసెస్డ్ ఫుడ్, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలని చెబుతారు. ఇక వారసత్వంగా సంక్రమించే కొన్ని రకాల క్యాన్సర్లను నియంత్రించేందుకు కొద్దిగా పచ్చిగా ఉండే అరటిపండును రోజూ తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
పూర్తిగా మగ్గని అరటిపండ్లు క్యాన్సర్లను ప్రధానంగా జీర్ణకోశ క్యాన్సర్ల ముప్పును తగ్గిస్తాయని తాజా అధ్యయనంలో నిగ్గు తేలింది. మగ్గని అరటిపండ్లలో ఉండే పిండి పదార్ధం పలు క్యాన్సర్లు సోకే ముప్పును 60 శాతానికి పైగా నివారిస్తాయని 20 ఏండ్ల పాటు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
యూనివర్సిటీస్ ఆఫ్ న్యూకాజిల్, లీడ్స్కు చెందిన నిపుణుల నేతృత్వంలో సాగిన ఈ అధ్యయన వివరాలు క్యాన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ప్రేవుల పైభాగంలో వచ్చే క్యాన్సర్లను కనుగొని గుర్తించడం కష్టమని వైద్యులు చెబుతున్న ఈ తరహా క్యాన్సర్లపై తాజా పరిశోధన సానుకూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Banana
- Cancer
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

